Share News

Red Sandalwood Smuggling: ఎర్రచందనం స్మగ్లింగ్.. ఆ పాత్ర ఎంతో ఆకట్టుకుంది: పవన్ కల్యాణ్..

ABN , Publish Date - Nov 13 , 2025 | 08:34 PM

గ్రేడ్ల వారీగా ఎర్రచందనం వివరాలను అధికారులను అడిగి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలుసుకున్నారు. స్మగ్లింగ్‌‌కు గురికాకుండా ఎర్ర చందనాన్ని కాపాడేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఉన్నతాధికారులతో చర్చించారు.

Red Sandalwood Smuggling: ఎర్రచందనం స్మగ్లింగ్.. ఆ పాత్ర ఎంతో ఆకట్టుకుంది: పవన్ కల్యాణ్..
Red Sandalwood Smuggling

అమరావతి: ఎర్రచందనం అక్రమ రవాణా (Red Sandalwood Smuggling)పై తాను చదివిన ఓ పుస్తకం ఎంతో ఆశ్చర్యానికి గురి చేసిందని ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తెలిపారు. అక్రమ రవాణాలో ఓ వ్యక్తి తనను తాను ఎలా కింగ్ పిన్‌లా మార్చుకున్నాడో చూసి షాక్ అయినట్లు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు పవన్. 'కొంతకాలం క్రితం నేను ది వైల్డ్ ఈస్ట్ (The Wild East) చదవడం మొదలుపెట్టాను. ఆ పుస్తకంలోని వివరాలు ఎంతో ఆశ్చర్యకరమైనవి. ఈ పుస్తకం శేషాచలం ప్రాంతం, తూర్పు కనుమలలో ఎర్రచందనం దోపిడీ గురించి చెబుతుంది. మన విలువైన సహజ వనరులను వ్యవస్థ ముందే ఎలా దోచుకున్నారో చూపిస్తుంది.


రాజకీయాల వెనుక దాక్కున్న కొంతమంది నాయకులు పూర్తి స్థాయి మాఫియా బాస్‌లాగా ఎలా వ్యవహరించారో ఇది వెల్లడిస్తుంది. వారిలో ఒక పాత్ర నా దృష్టిని ఆకర్షించింది. దాదాపు ఒక సినిమాలాగా ఎర్రచందనంపై దురాశతో అధికారాన్ని వాడుకుని ఓ చిన్న కాంట్రాక్టర్ మొత్తం నేర సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించాడో చూపించాడు రచయిత. మీరు ఆ పుస్తకం చదివినప్పుడు, నేరాన్ని అర్థం చేసుకోలేరు. భూమి, అడవులు, ప్రకృత, ప్రజలపై ద్రోహాన్ని అనుభవిస్తారు' అని పవన్ కల్యాణ్ తెలిపారు. కాగా, గత శనివారం నాడు తిరుపతి మంగళంలో ఎర్రచందనం గోడౌన్లను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పరిశీలించారు.


గ్రేడ్ల వారీగా ఎర్రచందనం వివరాలను అధికారులను అడిగి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలుసుకున్నారు. స్మగ్లింగ్‌‌కు గురికాకుండా ఎర్రచందనాన్ని కాపాడేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఉన్నతాధికారులతో చర్చించారు. వైసీపీ పాలనలో రూ.5వేల కోట్ల మేర ఎర్రచందనం స్మగ్లింగ్ జరిగి ఉంటుందని ఆరోపించారు. దాదాపు లక్షా 30 వేల చెట్లను నరికేశారని తెలిపారు. స్మగ్లింగ్‌ను అరికట్టాల్సిన బాధ్యత మనందరిపై ఉందని.. ఆ చెట్లను అందరం కలిసి కాపాడుకోవాలని ఉన్నతాధికారులకు సూచించారు. అందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ సైతం ఏర్పాటు చేసిన విషయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గుర్తు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Nara Lokesh: విశాఖకు త్వరలో 30 వేల ఉద్యోగాలు: నారా లోకేశ్

CII Summit 2025: సీఐఐ సమ్మిట్.. ఇవాళ ఒక్కరోజే ఎన్ని ఒప్పందాలంటే..

Updated Date - Nov 13 , 2025 | 09:02 PM