Home » Thummala Nageswara Rao
కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎంఆర్‌ఎఫ్ లబ్ధిదారులు ఇకపై ప్రజాప్రతినిధుల క్యాంపు కార్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవరంలేదని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
రాష్ట్రంలో ఒకవైపు మండుతున్న ఎండలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా.. మరోవైపు అకాల వర్షాలు రైతులను నట్టేట ముంచుతున్నాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా భానుడు నిప్పులు కక్కుతుండగా.. సాయంత్రానికి వాతావరణం చల్లబడి వరుణుడు పలకరిస్తున్నాడు.
రైతులకు రుణమాఫీ చేసినట్లుగానే, నేతన్నలకు కూడా రుణమాఫీ చేస్తామని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. చేనేత వర్గాల సమస్యలపై క్యాబినెట్‌లో చర్చించి, త్వరలోనే విధివిధానాలు ఖరారు చేయనున్నట్లు పేర్కొన్నారు.
పంట వ్యర్థాలను తగలబెట్టడం వల్ల నేల ఆరోగ్యంతోపాటు పంటలపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. వాటిని వినియోగించి బయోగ్యాస్ ఉత్పత్తి చేయడం ద్వారా రైతులకు అదనపు ఆదాయం, ఉపాధి అవకాశాలు కలుగుతాయని అన్నారు.
తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో జార్ఖండ్ వ్యవసాయ మంత్రి శిల్పి నేహ భేటీ అయ్యారు. రైతుల సంక్షేమ పథకాలపై చర్చించిన ఈ సమావేశంలో ఆయిల్‌పామ్, కృత్రిమ మేధస్సు వినియోగం, హార్టికల్చర్ రంగ అభివృద్ధి పై చర్యలు తీసుకోవడం అన్నింటిపై సమీక్షించారు
ప్రపంచ వ్యాప్తంగా ప్రజాస్వామిక రాజకీయాలు పూర్తిగా మారిపోయాయని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ అన్నారు. పదేళ్ల క్రితం అనుసరించిన రాజకీయ సూత్రాలు, అప్పుడు ప్రభావశీలంగా ఉన్న విధానాలు ఇప్పుడు పనికిరావన్నారు.
పత్తి కొనుగోళ్లలో జరిగిన అక్రమాలపై చేపట్టిన విజిలెన్స్ విచారణను సత్వరమే పూర్తి చేయాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలో అతి త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయని, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఇందుకోసం సిద్ధంగా ఉండాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు.
రాష్ట్రంలో పంటల బీమా పథకాన్ని అమలు చేయడానికి కసరత్తు చేస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. వానాకాలం, యాసంగి సీజన్లలో పంటల బీమాకు వర్తించగల పంటలపై ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులకు ఆదేశించారు
రైతు సంక్షేమంలో తెలంగాణకు సాటి మరో రాష్ట్రం రాష్ట్రం లేదని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఒకే విడతలో రైతు రుణమాఫీ పూర్తి చేసిన చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణేనని.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నా రూ..33వేల కోట్ల మేర రుణమాఫీ చేశామని చెప్పారు.