Home » Thanneeru Harish Rao
Telangana: పార్లమెంటు ఎన్నికల్లో కొద్దిగా ఆలోచన చేసి ఓటెయ్యాలని మాజీ మంత్రి హరీష్‌రావు అన్నారు. శుక్రవారం పాపన్నపేట మండలంలో బీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశంలో హరీష్‌రావు మాట్లాడుతూ.. రెండు లక్షల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ చేయలేదన్నారు. రుణమాఫీ చేయకపోవడంతో బ్యాంక్ అధికారులు ఊర్ల మీద వచ్చి పడుతున్నారన్నారు. వంద రోజులు దాటినా రుణమాఫీ చేయని కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలని అన్నారు.
Telangana: జిల్లాలోని హత్నూర మండలం చందాపూర్ కెమికల్ ఫ్యాక్టరీలో గాయపడి సంగారెడ్డి ఎంఎన్‌ఆర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్మికులను మాజీ మంత్రి హరీష్‌రావు పరామర్శించారు. ఈ ఘటనకు సంబంధించి కలెక్టర్ వల్లూరు క్రాంతితో హరీష్‌రావు ఫోన్‌లో మాట్లాడారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ ప్రమాదం దురదృష్టకరమన్నారు. బాధితులను ఆదుకోవడంలో యాజమాన్యం, ప్రభుత్వం విఫలం అయ్యాయని విమర్శించారు.
కాంగ్రెస్ (Congress) ప్రభుత్వాన్ని ఎవరు పడగొట్టరని.. ఆ పార్టీలోని నేతల గ్రూప్ రాజకీయాలే పడగొడతాయని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు (Harish Rao) అన్నారు. బుధవారం నాడు యాదాద్రి జిల్లాలో పర్యటించారు.
తెలంగాణలో పాలిటిక్స్ రోజురోజుకూ హీటెక్కుతున్నాయి. రైతులే టార్గెట్‌గా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ వార్ నడుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి మూడునెలల పాలనలో పెద్ద ఎత్తున రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని మాజీ సీఎం కేసీఆర్ విమర్శించారు.
Telangana: కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వ నీటి నిర్వహణ, విద్యుత్ వైఫల్యమే పంట నష్టానికి కారణమని ఆరోపించారు. మంగళవారం రాష్ట్రంలో ఎండిన పంటలకు ఎకరాకు 25 వేలు నష్టపరిహారం, పంటలకు నీళ్ళు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్‌కు హరీశ్‌రావు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరువును నివారించే ప్రయత్నలు ప్రభుత్వం చేయడం లేదని విమర్శించారు.
కాంగ్రెస్ పై తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ముఖ్య నేత హరీశ్ రావు ( Harish Rao ) స్ట్రాంగ్ కామెంట్స్ చేశారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పిందని ఆరోపించారు. ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలు కష్టపడి పని చేయాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harish Rao) అన్నారు. బీఆర్ఎస్ (BRS)అడ్డా... దుబ్బాక గడ్డా అని.. ఇక్కడ ఎన్నిక ఏదైనా ఎగిరేది గులాబీ జెండానేనని స్పష్టం చేశారు. శుక్రవారం నాడు మెదక్ పార్లమెంట్ ఎన్నికల బీఆర్ఎస్ సన్నాహక సమావేశం నిర్వహించారు.
తెలంగాణ(Telangana) రాష్ట్రంలో రోజుకో సంచలనం చోటు చేసుకుంటుంది. తాజాగా ఆరోగ్యశాఖ మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు(Harish Rao) పీఏ నరేష్ సహా మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఎం రిలీఫ్ ఫండ్(CMRF) చెక్కుల గోల్‌మాల్ కేసులో ఈ నలుగురిని జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నరేష్.. హరీష్ రావు వద్ద డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. మెదక్(Medak) జిల్లాకు చెందిన..
ప్రతిపక్షమే లేకుండా ఎమ్మెల్యేలను, ఎంపీలను కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకుంటూ ప్రజాస్వామ్యాన్ని సీఎం రేవంత్‌రెడ్డి అపహాస్యం చేస్తున్నారని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు(Harish Rao) అన్నారు. మంగళవారం నాడు బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవల్సిన అవసరం ఉందని చెప్పారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావు (Raghunandan Rao) పలు సంచలన విషయాలను బయటపెట్టారు. ఈ కేసులో రెండో బాధితుడిని తానేనని అన్నారు. మాజీ సీఎం కేసీఆర్(KCR) 2014 జూన్ 2వ తేదీన తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఫోన్ ట్యాపింగ్‌ను చేస్తున్నారని తెలిపారు. ఈ కేసులో మొట్టమొదటి బాధితుడు ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అని చెప్పారు.