Home » terror attack
Pahalgam Terror Attack: అనంత్‌నాగ్ పోలీసులు పహల్గామ్‌లో పర్యాటకులపై దాడికి పాల్పడ్డ వారిని గుర్తించే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలోనే ముగ్గురు అనుమానితుల చిత్రాలను విడుదల చేశారు. వీరిలో ఇద్దరిని పాకిస్తాన్‌కు చెందిన వారిగా గుర్తించారు.
Pahalgam Terror Attack: జమ్మూకాశ్మీర్ పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో మొత్తం 26 మంది చనిపోయారు. వీరిలో మహారాష్ట్రలోని పూణెకు చెందిన సంతోష్ జగదాలె కూడా ఉన్నారు. గురువారం ఆయన అంత్యక్రియలు జరిగాయి. వేల మంది ఆ అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
MP Raghunandan Rao: టెర్రరిస్ట్ సంస్థలపై మోదీ ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ఉగ్రదాడిపై సోకాల్డ్ సెక్యులర్ మేధావులు ఎందుకు మాట్లాడటం లేదని ఘునందన్ రావు ప్రశ్నించారు.
ఉగ్రవాద దాడి అమానవీయ చర్య అని,ఉగ్రవాదులను పూర్తిగా నిర్మూలించడం ప్రభుత్వ బాధ్యత అని సీఎం సిద్ధరామయ్య అన్నారు. దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలను పూర్తిగా అణచివేయడానికి, ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలకు తమ ప్రభుత్వం పూర్తిగా మద్దతు ఇస్తుందని ఆయన ప్రకటించారు.
అమెరికాలో ఉద్యోగం చేసుకుంటున్న మధుసూధనరావు.. తల్లిదండ్రులు, అత్తమామల కోసం ఆ ఉద్యోగాన్ని వదిలి ఇండియాకి వచ్చారు. కొన్నేళ్లుగా బెంగుళూరులో స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నారు. కాశ్మీర్ పర్యటనకు వెళ్లిన ఆయన ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు.
పర్యాటకులను గుర్రంపై బైసారను తీసు కెళ్తుంటాడు హుస్సేన్. అదే అతనికి జీవనోపాధి. మంగళవారం కూడా పర్యటకులను బైసారన్ పచ్చిక బయళ్ల ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడి క్యాంపుల్లోని పర్యాటకులు ప్రకృతిని ఆస్వాదిస్తున్నపుడే ఉగ్రవాదులు కాల్పులకు తెగ బడ్డారు. వారిని అడ్డుకొనే క్రమంలో హుస్సేన్ ప్రాణాలొదిలాడు.
కశ్మీర్‌లో పర్యాటకులపై ఉగ్రదాడిని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పిరికిపంద చర్యగా మండిపడ్డారు. పాకిస్థాన్‌ను ప్రపంచ దేశాల ఎదుట దోషిగా నిలబెడతామని హెచ్చరించారు
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశారు. కశ్మీర్‌లో ఉన్న తెలంగాణ వాసుల కోసం ఇది ప్రారంభమైంది.
పహల్గాం ఉగ్రదాడిని సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్ ఖండించింది. ఆర్టికల్ 370 రద్దు కశ్మీర్ సమస్యకు పరిష్కారం కాదని నేతలు వ్యాఖ్యానించారు
కశ్మీర్ అందాలు చూసి తరించాలని ఎన్నో ఆశలు, ఆనందాలతో పర్యాటకులు వెళ్తుంటారు. ఆ హిమతల స్వర్గాన్ని ఆశ్వాదించాని వెళ్లిన 20 మందిని ఉగ్రమూక పొట్టన పెట్టుకున్న..