Share News

Telangana Helpline: ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో హెల్ప్‌లైన్‌

ABN , Publish Date - Apr 24 , 2025 | 03:39 AM

పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ప్రత్యేక హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేశారు. కశ్మీర్‌లో ఉన్న తెలంగాణ వాసుల కోసం ఇది ప్రారంభమైంది.

Telangana Helpline: ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో హెల్ప్‌లైన్‌

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి): పహల్గాంలో ఉగ్రదాడి నేపథ్యంలో ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేసింది. రాష్ట్రానికి చెందిన ఎవరైనా ఉంటే స్పందించాలని తెలంగాణ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ గౌరవ్‌ ఉప్పల్‌ సూచించారు. కశ్మీర్‌ ప్రభుత్వంతోపాటు కేంద్ర ఏజెన్సీలతో సమన్వయం చేస్తున్నామని, తెలంగాణ వాసులు ఎవరైనా ఉన్నారా?అనే అంశంపై ఆరా తీస్తున్నామని తెలిపారు. సాయం కోసం 9871999044(వందన), 9971387500 (హైదర్‌అలీ నఖ్వీ) నంబర్లను సంప్రదించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కూడా ఢిల్లీలో హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేసింది. 9818395787, 011 23387089 నంబర్లను సంప్రదించాలని అధికారులు సూచించారు.

Updated Date - Apr 24 , 2025 | 03:39 AM