CPI ML Mass Line: ఉగ్రవాద దాడికి మాస్ లైన్ ఖండన
ABN , Publish Date - Apr 24 , 2025 | 03:35 AM
పహల్గాం ఉగ్రదాడిని సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్ ఖండించింది. ఆర్టికల్ 370 రద్దు కశ్మీర్ సమస్యకు పరిష్కారం కాదని నేతలు వ్యాఖ్యానించారు
నల్లకుంట, ఏప్రిల్ 23 (ఆంధ్రజ్యోతి): పహల్గాంలో ఉగ్రవాద దాడిని సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్ (ప్రజాపంథా) కేంద్ర కమిటీ ఖండించింది. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసింది. కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్ సింఘా ఠాకూర్, సహాయ కార్యదర్శి పోటు రంగారావు బుధవారం ఇక్కడ జరిగిన సమావేశంలో మాట్లాడారు. ఆర్టికల్ 370ని రద్దు చేసి పూర్తిస్థాయి రాష్ట్రాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చడం రాజకీయ సమస్యకు సరైన సమాధానం కాదని ఈ ఘటన మరోసారి రుజువు చేస్తుందన్నారు.