Home » Telangana Chief Minister
సంక్షేమ పథకాలు కేవలం సరఫరాదారుల లాభం కోసం కాకుండా, విద్యార్థుల ప్రయోజనాల కోసం ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. వస్తువుల కొనుగోలులో అక్రమాలను నివారించేందుకు అన్నిరకాల వస్తువులను సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్‌మెంట్ విధానం ద్వారానే సేకరించాలని అధికారులను ఆదేశించారు.
ప్రొఫెసర్ కోదండరాం, మహ్మద్ అజారుద్దీన్ శాసన మండలి సభ్యులుగా ఈరోజు(సోమవారం) ప్రమాణస్వీకారం చేశారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ప్రజావాణి సేవలను క్షేత్రస్థాయికి విస్తరించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. ప్రజావాణి వ్యవస్థపై సీఎం ఆదివారం సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం విద్యారంగాన్ని సమూలంగా ప్రక్షాళన చేస్తూ, అద్భుతమైన ఫలితాలను సాధిస్తోంది. అక్షరాస్యత పెంపు నుంచి బోధనా నాణ్యత వరకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు తెలంగాణ విద్యా వ్యవస్థలో కొత్త విప్లవానికి నాంది పలికాయి.
రైతు భరోసా రెండో విడత నిధులను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విడుదల చేశారు. 40 లక్షల మంది రైతులకు రైతు భరోసా ఇస్తున్నామని స్పష్టం చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కాళేశ్వరం ప్రపంచంలోనే అద్భతమని కేసీఆర్ అన్నారని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లోక్‌భవన్‌లో ఆదివారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. సీఎం రేవంత్‌రెడ్డి వెంట మంత్రి శ్రీధర్ బాబు, ఎంపీ వేం నరేందర్ రెడ్డి ఉన్నారు.
పార్లమెంట్‌లో మహిళా బిల్లు వీగిపోవడం చీకటి రోజని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు. మహిళా బిల్లు వీగిపోయిందని కాంగ్రెస్ వీర్రవీగుతోందని ధ్వజమెత్తారు.
తెలంగాణ రైతులకు శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న 'రైతు భరోసా' పథకం రెండో విడత నిధుల విడుదలకు ముహూర్తం ఖరారైంది.
బీజేపీతో పొత్తు పెట్టుకున్న పార్టీల మనుగడ భవిష్యత్తులో కష్టంగా ఉంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు పరిస్థితి కూడా అలాగే అవుతుందని పేర్కొన్నారు.