Home » Tamil Nadu
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈ నెల 12 వరకు భారీ వర్షం కురుస్తుందని చెన్నై ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ విషయంపై గురువారం పత్రికా ప్రకటన విడుదల చేసింది. నైరుతి బంగాళాఖాతంలో బాహ్య ఉపరితల ద్రోణి ఏర్పడి ఉందని, దీని ప్రభావంతో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలతో పాటు పుదుచ్చేరి, కారైక్కాల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షం కురుస్తుందని పేర్కొంది.
మదురై నుంచి ఈనెల 12న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు నయినార్ నాగేంద్రన్ ‘తమిళగం నిమిర తమిళనిన్ పయనం’ పేరుతో చేపట్టనున్న ప్రచారానికి నగర పోలీసు శాఖ అనుమతులు జారీచేసింది.
అదే రైలులో చిత్తూరుకు చెందిన 45 ఏళ్ల శంకర్ కూడా ప్రయాణిస్తున్నాడు. అతడు వస్త్ర వ్యాపారం చేయడానికి ఈరోడ్ వెళుతున్నాడు. బుధవారం ఉదయం రైలు ధర్మపురి దాటిన తర్వాత శంకర్ తన పాడు బుద్ధి బయటపెట్టాడు.
జీవవైవిధ్య వారసత్వ ప్రదేశంగా ఈరోడ్ జిల్లాలోని నాగమలై కొండను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనితో రాష్ట్రంలో జీవవైవిధ్య వారసత్వ ప్రదేశాల సంఖ్య నాలుగుకు పెరిగింది. ఈ మేరకు రాష్ట్ర పర్యావరణ, అటవీ శాఖ బుధవారం ప్రకటన జారీ చేసింది.
నాలుగేళ్లుగా గవర్నర్‌తో రాష్ట్ర ప్రభుత్వం పోరాడుతూనే ఉందని ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి పేర్కొన్నారు. ఇక్కడ జరిగిన తిరుచ్చి శ్రీరంగం శాసనసభ నియోజకవర్గ పార్టీ సమావేశంలో పాల్గొన్న ఉదయనిధి మాట్లాడుతూ.. రాష్ట్రంలో అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారం ప్రారంభించాయన్నారు.
కరూర్ రోడ్‌షోలో ప్రాణాలు కోల్పోయిన 41 మంది కుటుంబీకులను పరామర్శించేందుకు తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్ తగు సన్నాహాలు చేపడుతున్నారు. ఆ దిశగా ఆయన తరఫు న్యాయవాదులు తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నారు.
విజయ్ తరఫున న్యాయవాదులు దీక్షిత గోహిల్, ప్రాంజల్ అగర్వాల్, ఎస్ విజయ్‌లు ఈ పిటిషన్ దాఖలు చేశారు. అక్టోబర్ 10న ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించనుంది. ఇదే కేసుకు సంబంధించి మరో పిటిషన్ కూడా అడ్వకేట్ జీఎస్ మణి దాఖలు చేశారు.
వారం రోజులుగా డెంగ్యూ జ్వరాల వ్యాప్తి అధికంగా ఉందని ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం తెలిపారు. ఈశాన్య రుతుపవనాల ముందస్తు చర్యలు - అంటువ్యాధుల నిరోధక పనులపై ఆరోగ్య, పురపాలక నిర్వహణ, గ్రామీణాభివృద్ధి శాఖల ఉన్నతాధికారులతో స్థానిక సచివాలయంలో మంగళవారం మంత్రి ఎం.సుబ్రమణ్యం సమావేశమయ్యారు.
పుదుకోటకు చెందిన హిజ్రా తొలి డ్రోన్ పైలెట్ అయ్యారు. పుదుకోటకు చెందిన హిజ్రా శివాని (40) డిగ్రీ పూర్తిచేసి, దివ్యాంగుల సంక్షేమ సంఘం కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. కోవై వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని రిమోట్ డ్రోన్ పైలెట్ సెంటర్‌లో నాబార్డ్ ఆర్థిక సాయంతో ‘డ్రోన్ పైలెట్’ శిక్షణను శివాని పూర్తి చేశారు.
ఊహించలేనిది జరిగింది... ఏ రకంగాను మీ నష్టాన్ని భర్తీచేయలేం... ఎల్లప్పుడూ మీ కుటుంబానికి అండగా ఉంటా... త్వరలోనే మిమ్మల్ని కలుసుకుంటా’ అంటూ కరూర్ మృతుల కుటుంబాలకు తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్ ఓదార్చారు.