• Home » Suryapet

Suryapet

Suryapet: అయ్యో.. ‘అమ్మ’..!

Suryapet: అయ్యో.. ‘అమ్మ’..!

నవమాసాలు మోసి, పురిటినొప్పులను భరించి.. తమను కని, పెంచిన ఆ తల్లి రుణాన్ని తీర్చుకోకపోగా.. శవం వద్దే ఆస్తి పంపకాల కోసం ఆమె కొడుకు, కూతుళ్లు తగవులాడుకున్న ఉదంతమిది..! చిన్నప్పుడు తల్లి వద్ద మారాం చేసి మరీ తనకు కావాల్సినవి సమకూర్చుకున్న ఆ కొడుకు.. ఇప్పుడు పైసలిస్తేనే తలకొరివి పెడతానంటూ మారాం చేస్తున్నాడు. దీంతో.. కూతుళ్లు తమ ఇళ్లకు వెళ్లిపోగా.. ఆ అమ్మ మృతదేహం రెండ్రోజులుగా ఫ్రీజర్లో ఉండిపోయింది.

Road Accident: సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..

Road Accident: సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..

సూర్యాపేట జిల్లా: కోదాడ శివారు దుర్గాపురం వద్ద హైదరాబాద్- విజయవాడ 65వ రహదారిపై గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా మరో మహిళ పరిస్థితి విషమంగా ఉంది.

Congress: రెండు రోజులుగా కనిపించని కాంగ్రెస్ నేత.. కుటుంబీకుల ఆందోళన

Congress: రెండు రోజులుగా కనిపించని కాంగ్రెస్ నేత.. కుటుంబీకుల ఆందోళన

Telangana: అధికార పార్టీ కాంగ్రెస్‌కు (Congress) చెందిన నేత కనిపించకుండా పోవడం ఆందోళనకు గురిచేస్తోంది. ఎల్కారంకి చెందిన కాంగ్రెస్ నేత ఒకరు గత రెండు రోజులుగా కనిపించడం లేదంటూ కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో కాంగ్రెస్ నేత అదృశ్యమైన వార్త జిల్లాలో సంచలనంగా మారింది. ఇంతకీ సదరు నేత ఎక్కడికి వెళ్లారు?... ఎవరైనా కిడ్నాప్ చేశారా?.. ఇంతకీ ఏ పని మీద వెళ్లి కనిపించకుండా పోయారో ఇప్పుడు చూద్దాం...

KCR:  ఉమ్మడి నల్గొండ జిల్లాలో కేసీఆర్ పర్యటన నేడు..

KCR: ఉమ్మడి నల్గొండ జిల్లాలో కేసీఆర్ పర్యటన నేడు..

నల్గొండ : బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆదివారం నేడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ ఉదయం 9 గంటలకు యాదాద్రి భువనగిరి జిల్లా మీదుగా జనగామకు వెళతారు. 11 గంటలకు సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి మండలం వెలుగుపల్లిలో ఎండిన పొలాలను పరిశీలిస్తారు.

Saidireddy: మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి టెలికాన్ఫరెన్స్‌ వాయిస్‌ రికార్డ్‌ వైరల్‌

Saidireddy: మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి టెలికాన్ఫరెన్స్‌ వాయిస్‌ రికార్డ్‌ వైరల్‌

సూర్యాపేట: హుజూర్‌నగర్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి టెలికాన్ఫరెన్స్ వాయిస్ రికార్డ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ‘రాష్ట్రంలో బీజేపీ పుంజుకుంటోంది. బీఆర్‌ఎస్‌ పరిస్థితి అర్థం కావడం లేదు. పార్లమెంటుకు పోటీ చేయాలంటే ఆ పార్టీ నేతలు చాలామంది భయపడుతున్నార’ని హుజూర్‌నగర్‌ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు.

TS News: తెలంగాణలో డ్రగ్ కంట్రోల్ అధికారుల తనిఖీలు

TS News: తెలంగాణలో డ్రగ్ కంట్రోల్ అధికారుల తనిఖీలు

Telangana: తెలంగాణలో డ్రగ్ కంట్రోల్ అధికారులు తనిఖీలు చేపట్టారు. సూర్యాపేట, హైదరాబాద్ జిల్లాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. సూర్యపేట జిల్లా మట్టంపల్లి గ్రామంలో న్యూదుర్గాభవని మెడికల్ షాపులో తనిఖీలు నిర్వహించారు. మెడికల్ షాప్ నిర్వాహకుడు రవీంద్రనాయక్ ఇంట్లో 10 రకాల మెడిసిన్స్... 20వేల414రూపాయల విలువగల 80 దగ్గు సిరప్స్, 150 నైట్రాజెపామ్‌ మాత్రలు సీజ్ చేశారు.

TS News:  బీఆర్ఎస్ పార్టీకి 16 మంది కౌన్సిలర్ల  రాజీనామా

TS News: బీఆర్ఎస్ పార్టీకి 16 మంది కౌన్సిలర్ల రాజీనామా

సూర్యాపేట జిల్లా: బీఆర్ఎస్ పార్టీకి 16 మంది కౌన్సిలర్లు మూకుమ్మడి రాజీనామా చేశారు. గత నెలలో 31 వార్డు కౌన్సిలర్ నిఖిల దిలీప్ రెడ్డి నేతృత్వంలో అవిశ్వాసానికి ప్రయత్నించి కౌన్సిలర్లు విఫలమయ్యారు.

Suicide: సూర్యాపేట, పాఠశాల ముందు వైష్ణవి కుటుంబసభ్యుల ఆందోలన

Suicide: సూర్యాపేట, పాఠశాల ముందు వైష్ణవి కుటుంబసభ్యుల ఆందోలన

సూర్యాపేట: ఇమాంపేట బాలికల గురుకుల పాఠశాలలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని వైష్ణవి తన హాస్టల్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. వైష్ణవి మృతిపై అనుమానాలు ఉన్నాయని, నిజనిర్ధారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Suicide: సూర్యాపేట: విద్యార్థిని ఆత్మహత్య

Suicide: సూర్యాపేట: విద్యార్థిని ఆత్మహత్య

సూర్యాపేట: ఇమాంపేట బాలికల గురుకుల పాఠశాలలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని వైష్ణవి తన హాస్టల్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సూర్యాపేటలోని 9వ వార్డు ఎన్టీఆర్ కాలనీకు చెందిన విద్యార్థినిగా గుర్తించారు.

TS News: మాజీ ఎంపీపీపై దాడి.. సూర్యాపేటలో ఉద్రిక్తత

TS News: మాజీ ఎంపీపీపై దాడి.. సూర్యాపేటలో ఉద్రిక్తత

Telangana: జిల్లాలోని కోదాడ మండలం గుడిబండ గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ ఎంపీపీ కవితపై గ్రామస్థులు దాడి చేశారు. గుడిబండ గ్రామ నాయి బ్రాహ్మణులకు కేటాయించిన ప్రభుత్వ భూమిని మాజీ ఎంపీపీ కొనుగోలు చేసి ఇల్లు నిర్మాణం చేసుకున్నారంటూ గ్రామస్థులు మండిపడుతున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి