Home » Stock Market
భాగ్యనగరంలో ఘరానా మోసం జరిగింది. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడుల పేరుతో ఓ ముఠా చేసిన భారీ మోసం వెలుగులోకి వచ్చింది. రూ.150 కోట్ల వరకు నిందితులు మోసం చేశారు. జీడిమెట్ల ఠాణా పరిధిలోని చింతల్ గణేష్ నగర్‌లో ది పెంగ్విన్ సెక్యూరిటీస్ పేరుతో ఓ సంస్థను కేటుగాళ్లు ఏర్పాటు చేశారు.
గురువారం లాభాలను ఆర్జించిన దేశీయ సూచీలు ఈ వారానికి నష్టాలతోనే టాటా చెప్పాయి. అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన సంకేతాలతో పాటు ప్రధాన షేర్లలో అమ్మకాలు దేశీయ సూచీలను నష్టాల బాట పట్టించాయి.
గత రెండ్రోజులుగా ఎదురవుతున్న కాస్త బ్రేక్ పడింది. గురువారం దేశీయ సూచీలు లాభాలను ఆర్జించాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాలతో పాటు విదేశీ మదుపర్లు అమ్మకాలు కొనసాగిస్తుండడం, ప్రధాన షేర్లలో కొనుగోళ్లు దేశీయ సూచీలను నడిపించాయి.
అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల ప్రభావం దేశీయ సూచీలపై నెగిటివ్ ప్రభావాన్ని చూపిస్తోంది. మంగళవారం భారీగా నష్టపోయిన సూచీలు బుధవారం కూడా అదే బాటలో కొనసాగాయి. అయితే విదేశీ మదుపర్లు అమ్మకాలు కొనసాగిస్తుండడం మాత్రం కాస్త కలిసొచ్చే అంశంగా కనిపిస్తోంది.
అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల ప్రభావం రెండ్రోజుల లాభాలకు బ్రేక్ వేసింది. హెవీ వెయిట్ షేర్లలో అమ్మకాలతో పాటు ఆటో, ఎఫ్ఎమ్‌సీజీ, ఐటీ రంగాల నష్టాలు సూచీలను కిందకు లాగాయి. ప్రస్తుతం వెలువడుతున్న త్రైమాసిక ఫలితాలు కూడా మార్కెట్‌ను ప్రభావితం చేస్తున్నాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు (మే 27, 2025న) మొత్తం రెడ్‌లోనే దూసుకెళ్తున్నాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ ఏకంగా 800 పాయింట్లకుపైగా పడిపోగా, నిఫ్టీ 200 పాయింట్లు నష్టపోయింది (Stock Market Loss). దీంతో ఇన్వెస్టర్లు కొద్ది సేపట్లోనే భారీ మొత్తాలను కోల్పోయారు.
యూరోపియన్ యూనియన్‌తో వాణిజ్య చర్చల పొడిగింపును జులై 9 వరకు వాయిదా వేయడంతో 50 శాతం టారిఫ్‌ల అమలు వాయిదా పడడం అంతర్జాతీయ మార్కెట్లపై సానుకూల ప్రభావాన్ని చూపింది. దీంతో దేశీయ సూచీలు కూడా ఈ వారాన్ని లాభాలతో ప్రారంభించింది.
భారత స్టాక్ మార్కెట్లు ఈరోజు (మే 26, 2025న) భారీ లాభాలతో (Stock Market Updates) మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీ సహా సూచీలు మొత్తం పాజిటివ్ ధోరణిలోనే ఉన్నాయి. ఈ క్రమంలో టాప్ 5 లాభనష్టాల స్టాక్స్ గురించి ఇక్కడ తెలుసుకుందాం.
అమెరికా అప్పులపై అంతర్జాతీయంగా ఆందోళన నెలకొనడం, బాండ్ ఈల్డ్స్ పెరగడం వంటి కారణాలతో అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. ఆ ప్రభావం దేశీయ సూచీల మీద కూడా బలంగా పడింది. దీంతో బుధవారం భారీగా లాభపడిన సూచీలు గురువారం నష్టాలను మూటగట్టుకున్నాయి.
దేశీయ స్టాక్ మార్కెట్ కూప్పకూలింది. ఈ క్రమంలో నేడు (మే 22, 2025న) సెన్సెక్స్ వెయ్యి పాయింట్లు నష్టపోగా, మిగతా సూచీలు కూడా భారీ నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు కొన్ని గంటల వ్యవధిలోనే లక్షల కోట్ల రూపాయలను నష్టపోయారు.