Stock Market: స్వల్ప నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు.. ఈ రోజు టాప్ స్టాక్స్ ఇవే..
ABN , Publish Date - Jul 17 , 2025 | 10:05 AM
రష్యాతో వ్యాపారం చేస్తే వంద శాతం సుంకాలు విధిస్తామని భారత్, చైనాలకు నాటో దేశాలు హెచ్చరికలు చేసిన నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సెన్సెక్స్, నిఫ్టీ స్వల్ప నష్టాల్లో కదలాడుతున్నాయి
భారత్‌తో ఇండోనేసియా తరహా వాణిజ్యం ఒప్పందం చేసుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొనడం మదుపర్లను కలవరపెడుతోంది. అలా అయితే దేశీయ తయారీ రంగానికి ఇబ్బందులు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే రష్యాతో వ్యాపారం చేస్తే వంద శాతం సుంకాలు విధిస్తామని భారత్, చైనాలకు నాటో దేశాలు హెచ్చరికలు చేయడం కూడా మర్కెట్లను కలవరపరుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సెన్సెక్స్, నిఫ్టీ స్వల్ప నష్టాల్లో కదలాడుతున్నాయి (Business News).
బుధవారం ముగింపు (82, 634)తో పోల్చుకుంటే గురువారం ఉదయం వంద పాయింట్లకు పైగా లాభంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత నష్టాల బాట పట్టింది. ఒక దశలో దాదాపు 100 పాయింట్లు కోల్పయి 82, 532 వద్ద కనిష్టానికి చేరింది. ప్రస్తుతం ఉదయం 10:00 గంటల సమయంలో సెన్సెక్స్ 69 పాయింట్ల నష్టంతో 82, 565 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే సాగుతోంది. ప్రస్తుతానికి 22 పాయింట్ల నష్టంతో 25, 189 వద్ద కొనసాగుతోంది.
సెన్సెక్స్‌లో బ్లూ స్టార్, ఏంజెల్ వన్, ప్రెస్టీజ్ ఎస్టేట్, సోనా బీఎల్‌డబ్ల్యూ, కేఈఐ ఇండస్ట్రీస్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, యూనియన్ బ్యాంక్, మ్యాక్స్ ఫైనాన్సియల్, ఎల్‌టీఐ మైండ్ ట్రీ, ఇండియన్ బ్యాంంక్ షేర్లు నష్టాల బాటలో కొనసాగుతున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 5 పాయింట్ల స్వల్ప నష్టంతో ఉంది. బ్యాంక్ నిఫ్టీ 73 పాయింట్ల నష్టంతో కొనసాగుతోంది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 85.83గా ఉంది.
ఇవి కూడా చదవండి..
తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
టెక్ మహీంద్రా లాభం రూ.1,140 కోట్లు
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..