Stock Market: సూచీలకు లాభాల జోష్.. రిలయెన్స్ ఇన్వెస్టర్స్‌కు ఊహించని షాక్..
ABN , Publish Date - Jul 21 , 2025 | 04:24 PM
గత రెండు సెషన్లలో నష్టాలను చవి చూసిన దేశీయ సూచీలు ఈ వారాన్ని సానుకూలంగా ప్రారంభించాయి. బ్యాంకింగ్ రంగంలో కొనుగోళ్లు సూచీలను ముందుకు నడిపించాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ మెరుగైన త్రైమాసిక ఫలితాలు వెల్లడించడం మార్కెట్లకు కలిసొచ్చింది.
గత రెండు సెషన్లలో నష్టాలను చవి చూసిన దేశీయ సూచీలు ఈ వారాన్ని సానుకూలంగా ప్రారంభించాయి. బ్యాంకింగ్ రంగంలో కొనుగోళ్లు సూచీలను ముందుకు నడిపించాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ మెరుగైన త్రైమాసిక ఫలితాలు వెల్లడించడం మార్కెట్లకు కలిసొచ్చింది. దీంతో ఉదయం కాసేపు నష్టాల్లో కదలాడిన సూచీలు ఆ తర్వాత లాభాల పట్టాయి. చివరకు సెన్సెక్స్, నిఫ్టీ లాభాలతో రోజును ముగించాయి. (Business News).
గత శుక్రవారం ముగింపు (81, 757)తో పోల్చుకుంటే సోమవారం ఉదయం లాభాలతో మొదలైన సెన్సెక్స్ కాసేపటికే నష్టాల్లోకి జారుకుంది. ఆ తర్వాత లాభాల్లోకి ప్రవేశించి రోజంతా లాభాల్లోనే కదలాడింది. మధ్యాహ్నం తర్వాత ఆ లాభాలు మరింత పెరిగాయి. చివరకు సెన్సెక్స్ 442 పాయింట్ల లాభంతో 82, 200 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే నడించింది. చివరకు 122 పాయింట్ల లాభంతో 25, 090 వద్ద రోజును ముగించింది. కాగా, రికార్డు స్థాయి లాభాలను ప్రకటించిన రిలయెన్స్ కంపెనీ ఈ రోజు నష్టాలను మూటగట్టుకోవడం విశేషం.
సెన్సెక్స్‌లో ఎటర్నల్, పెర్సిస్టెంట్, యూపీఎల్, నేషనల్ అల్యూమినియం, ఎల్‌టీ ఫైనాన్స్ షేర్లు లాభాలు ఆర్జించాయి. ఏయూ స్మాల్ ఫైనాన్స్, ఐఈఎక్స్, రిలయెన్స్, యూనియన్ బ్యాంక్, బంధన్ బ్యాంక్ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 363 పాయింట్లు లాభపడింది. బ్యాంక్ నిఫ్టీ 669 పాయింట్లు ఆర్జించింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 86.29గా ఉంది.
ఇవి కూడా చదవండి
ఈ వారం రానున్న ఐపీఓలు ఇవే.. ఈసారి ఎన్ని వస్తున్నాయంటే..
ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి