Share News

Indian Stock Market Crash: మళ్లీ 25,000 దిగువకు నిఫ్టీ

ABN , Publish Date - Jul 19 , 2025 | 04:56 AM

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ ప్రామాణిక సూచీలు వారాంతం ట్రేడింగ్‌లో భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్‌

Indian Stock Market Crash: మళ్లీ 25,000 దిగువకు నిఫ్టీ
Indian Stock Market Crash

  • సెన్సెక్స్‌ 501 పాయింట్లు పతనం

  • రూ.3 లక్షల కోట్ల సంపద ఆవిరి

ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ ప్రామాణిక సూచీలు వారాంతం ట్రేడింగ్‌లో భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్‌ 501.51 పాయింట్లు క్షీణిం చి 81,757.73 వద్దకు జారుకుంది. నిఫ్టీ 143.05 పాయింట్లు కోల్పోయి నెల రోజుల కనిష్ఠ స్థాయి 24,968.40 వద్ద ముగిసింది. ఈక్విటీ వర్గాల సంపదగా భావించే బీఎ్‌సఈ లిస్టెడ్‌ కంపెనీల మొత్తం మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ దాదాపు రూ.3 లక్షల కోట్లు తగ్గి రూ.458.37 లక్షల కోట్లకు జారుకుంది. నిరాశాజనక త్రైమాసిక ఆర్థిక ఫలితాలు, విదేశీ సంస్థాగత పెట్టుబడుల ఉపసంహరణ నేపథ్యంలో ఇన్వెస్టర్లు బ్యాంకింగ్‌ షేర్లలో అమ్మకాలకు పాల్పడటం ఇందుకు కారణమైంది. సెన్సెక్స్‌లోని 30 కంపెనీల్లో 22 నష్టపోయాయి.

ఇవి కూడా చదవండి

యూట్యూబ్ హైప్‌ ప్రారంభం.. ఎలా ఉపయోగించాలో తెలుసా..

ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 19 , 2025 | 04:56 AM