Home » Sports news
శ్రేయస్ అయ్యర్ ఆరోగ్యంగానే ఉన్నాడని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా అన్నారు. వైద్యులు అనుకున్న దాని కంటే వేగంగా కోలుకుంటున్నట్లు చెప్పారు. శ్రేయస్ ఎలాంటి సర్జరీ చేయించుకోలేదని.. భిన్నమైన వైద్య ప్రక్రియతో అంతర్గత రక్తస్రావం జరగకుండా వైద్యులు చూశారని తెలిపారు.
మహ్మద్ షమీ భారత్ తరఫున చివరగా ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడాడు. ఆ తర్వాత ఏ ఫార్మాట్లోనూ జాతీయ జట్టుకు ఎంపిక కాలేకపోతున్నాడు. ఫిట్నెస్ సమస్యల దృష్ట్యా అతడిని పక్కన పెడుతున్నారన్న వాదన ఉంది. ఇటీవల ఆస్ట్రేలియాతో పరిమిత ఓవర్ల సిరీస్‌ల్లోనూ చోటు దక్కకపోవడంతో షమీ అసంతృప్తి వ్యక్తం చేశాడు.
కేవలం 66 బంతుల్లోనే 80 పరుగులు చేసిన స్మృతి అనవసర షాట్ ఆడి తన వికెట్ కోల్పోయింది. ఈ విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్ అంజుమ్ చోప్రా మాట్లాడారు.
సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో మూడో వన్డేలో శ్రేయస్ అయ్యర్ ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన విషయం తెలిసిందే. క్యాచ్ పట్టుకునే క్రమంలో అయ్యర్ ఎడమ వైపు పక్కటెముకలు నేలను బలంగా తాకడంతో అతడి ప్లీహానికి గాయమైంది. అయ్యర్ గాయం చాలా సున్నితమైంది కావడంతో ఇప్పుడప్పుడే మైదానంలోకి దిగే పరిస్థితి మాత్రం కనిపించడం లేదు.
ఆస్ట్రేలియా, భారత్ మధ్య అక్టోబర్ 29(బుధవారం) నుంచి ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచ కప్‌నకు సన్నాహకంగా ఈ సిరీస్‌ను ఉపయోగించుకోవాలని టీమిండియా చూస్తోంది. 5 మ్యాచ్‌ల సిరీస్‌లో మొదటి మ్యాచ్ కాన్‌బెర్రాలోని మనుకా ఓవల్ వేదికగా జరగనుంది.
కృతజ్ఞతలు అందుకునేందుకు విరాట్ అర్హుడని ఏబీడీ అన్నాడు. అతడిలో మరో ఐదేళ్లు క్రికెట్ ఆడగల సత్తా ఉందని.. కోహ్లీ 2027 వరల్డ్ కప్ తర్వాతే తన అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తాడని తన అభిప్రాయమని వెల్లడించాడు.
సూర్య కుమార్ యాదవ్ ఫామ్‌పై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్పందించాడు. దూకుడుగా ఆడే క్రమంలో సూర్య త్వరగా ఔటవుతున్నాడని, కాబట్టి అతడి ఫామ్ గురించి ఆందోళన పడటం అనవసరమని అన్నాడు.
ఆస్ట్రేలియాతో వన్డేలో గాయపడిన టీమిండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఆరోగ్యం నిలకడగా ఉందని సూర్య కుమార్ యాదవ్ తెలిపారు. ఫిజియో వేగంగా స్పందించడం వల్ల ప్రాణాపాయం తప్పిందని తెలిపారు.
భారత బ్యాడ్మింటన్ దిగ్గజం పీవీ సింధు కీలక నిర్ణయం తీసుకుంది. 2025 సీజన్‌ను ముందుగానే ముగిస్తున్నట్లు వెల్లడించింది. గాయం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోమవారం సోషల్ మీడియా వేదికగా ప్రకటన విడుదల చేసింది.
ఫీల్డింగ్ చేస్తుండగా భారత స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తీవ్రంగా గాయపడ్డాడు. తాజాగా అతడిని ఐసీయూలో చేర్చినట్లు వార్తలు వస్తున్నాయి. అంతర్గతంగా రక్తస్రావం కావడంతోనే మేనేజ్మెంట్ ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. ఈ విషయంపై బీసీసీఐ అధికారికంగా స్పందించింది. శ్రేయస్ గాయం పరిస్థితిపై అప్డేట్ ఇచ్చింది.