Smriti Mandhana Wedding: ఊహించని పరిణామం.. స్మృతి మంధాన పెళ్లి వాయిదా..
ABN , Publish Date - Nov 23 , 2025 | 04:50 PM
స్మృతి మంధాన, పలాష్ ముచ్చల్‌ల పెళ్లి వాయిదా పడింది. ఈ రోజు మధ్యాహ్నం ఇద్దరి పెళ్లి జరగాల్సి ఉంది. అయితే, స్మృతి మంధాన కుటుంబంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఆ కారణంతో పెళ్లి వాయిదా పడింది.
భారత మహిళల జట్టు స్టార్ ప్లేయర్ స్మృతి మంధాన కుటుంబంలో ఊహించని సంఘటన చోటుచేసుకుంది. ఆ సంఘటన కారణంగా స్మృతి మంధాన పెళ్లి వాయిదా పడింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఈ రోజు (ఆదివారం) స్మృతి మంధాన, పలాష్ ముచ్చల్‌ల పెళ్లి ఇండోర్‌లో జరగాల్సి ఉంది. పెళ్లి కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. శనివారం రాత్రి ఏర్పాటు చేసిన సంగీత్‌లో స్మృతి, ముచ్చల్‌ల జంట డ్యాన్స్‌తో అదరగొట్టింది. ఈ రోజు ఉదయం ఊహించని పరిణామం చోటుచేసుకుంది. స్మృతి తండ్రి శ్రీనివాస్ మంధాన అనారోగ్యానికి గురయ్యారు.
ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసిన తర్వాత ఆయనకు గుండెపోటు వచ్చింది. కుటుంబసభ్యులు హుటాహుటిన శ్రీనివాస్‌ను సంగ్లిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి వైద్యులు శ్రీనివాస్‌ను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. శ్రీనివాస్ మంధాన అనారోగ్యం నేపథ్యంలో ఈ రోజు జరగాల్సిన పెళ్లి వాయిదా పడింది. ఈ విషయాన్ని వెడ్డింగ్ మేనేజ్‌మెంట్ స్వయంగా వెల్లడించింది. అయితే, పెళ్లి ఎప్పుడు జరుగుతుందన్న దానిపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు.
ఈ సంఘటనపై స్మృతి మంధాన మేనేజర్ మాట్లాడుతూ.. ‘బ్రేక్ ఫాస్ట్ చేసిన తర్వాత ఆయన అస్వస్థతకు గురయ్యారు. ఆయన వెంటనే కోలుకుంటారని అనుకున్నాం. కానీ, ఆయన పరిస్థితి మరింత దారుణంగా మారింది. మేము రిస్క్ తీసుకోలేదు. వెంటనే అంబులెన్స్‌ను పిలిపించాము. ఆస్పత్రికి తీసుకెళ్లాం. ఆయన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నారు. స్మృతికి తండ్రి అంటే ఎంతో ఇష్టం. తండ్రి ఆరోగ్యం బాగు పడిన తర్వాతే పెళ్లి చేసుకుంటానని చెప్పేసింది’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి
మీ కళ్లు పవర్‌ఫుల్ అయితే.. ఈ మడుగులో మొసలి ఎక్కడుందో 10 సెకెన్లలో కనిపెట్టండి..
అవసరమైతే రాజకీయ పార్టీ పెడతా: విజయసాయిరెడ్డి