Home » Siddipet
తెలంగాణలో బీఆర్ఎస్‌ది ఇక ముగిసిన అధ్యాయమని, బీజేపీ, కాంగ్రెస్ మాత్రమే రాష్ట్రంలో మిగిలాయని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక మూడు రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్ ఉందని, త్వరలో అక్కడా ఆ పార్టీ ఓడిపోతుందని ఆయన జోస్యం చెప్పారు.
మహారాష్ట్రలోని పుణె, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కలకలం రేపిన గులియన్ బారీ సిండ్రోమ్(జీబీఎస్) కేసు ఒకటి.. తెలంగాణలోనూ వెలుగుచూసింది. సిద్దిపేట జిల్లాకు చెందిన ఒక మహిళ(25) దాని బారిన పడింది!
ఉపాధి హామీ పనులు చేస్తుండగా బండ రాళ్లు మీద పడి ఇద్దరు కూలీలు మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గోవర్ధనగి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం హైదరాబాద్ యాదవ సంఘం ఆధ్వర్యంలో మల్లన్నకు పట్నంవారం పెద్దపట్నం, అగ్నిగుండాలను ఘనంగా నిర్వహించారు.
కొమురవెల్లిలో పట్నంవారం! ఈ వేడుక కోసమే హైదరాబాద్ నుంచి భక్తులు తండోపతండాలుగా వస్తారు. మల్లనస్వామికి పచ్చ, సునేరు, తెల్లపిండి, కుంకుమ, పసుపుతో పటం పరిచి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు.
కొమురవెల్లి క్షేత్రం పట్నంవారానికి సిద్ధమైంది. మల్లన్న బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టం నేపథ్యంలో శనివారం సాయంత్రం హైదరాబాద్‌కు చెందిన వేలాదిమంది భక్తులు తరలివెళ్లనున్నారు.
జనవరి 26 వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ తెలిపారు. సిద్దిపేటలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో కంది కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలోమాజీ సీఎం కేసీఆర్‌తో కలిసి ఆయన మనవడు హిమాన్షురావు పొలం పనులు చేశారు.
తెలంగాణ: సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలం కొండపోచమ్మ సాగర్ డ్యాంలో గల్లంతయిన ఐదుగురిలో నలుగురి మృతదేహాలు లభ్యం అయ్యాయి. గల్లంతయిన వారిలో ఇప్పటివరకూ దినేశ్వర్, జతీన్, ధనుష్, సాహిల్ మృతదేహాలను గజ ఈతగాళ్లు బయటకు తీసుకువచ్చారు.
Telangana: సిద్ధిపేట జిల్లాలోని కొండపోచమ్మ సాగర్ డ్యాంలో సరదాగా ఈతకొట్టేందుకు వెళ్లిన ఆ యువకులను మృత్యువు బలితీసుకుంది. డ్యాంలో పడి ఐదుగురు యువకులు ప్రాణాలు కోల్పోగా.. ఇద్దరు యువకులు సురక్షితంగా బయటపడ్డారు.