Home » Shreyas Iyer
తొడ కండరాల గాయంతో ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి మూడో వన్డేకు దూరమైన విషయం తెలిసిందే. తాజాగా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఈ జాబితాలో చేరాడు. సిడ్నీ వేదికగా జరుగుతున్న ఆఖరి మ్యాచ్‌లో క్యాచ్ అందుకునే క్రమంలో తీవ్రంగా గాయపడ్డాడు.
హిట్ మ్యాన్ రోహిత్ శర్మ (73), శ్రేయస్ అయ్యర్ (61) రాణించడంతో ఆడిలైడ్‌లో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌లో టీమిండియా కాస్త మెరుగైన స్థితిలో నిలిచింది. అక్షర్ పటేల్ (44) కూడా కీలక ఇన్నింగ్స్‌తో ఆదుకోవడంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 264 పరుగులు చేసింది.
శ్రేయాస్ అయ్యర్‌ను ఆస్ట్రేలియాతో జరగనున్న మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌కు భారత ఏ జట్టు కెప్టెన్‌గా బీసీసీఐ గురువారం నియమించింది. ఈ మ్యాచ్‌లు సెప్టెంబర్ 30 నుంచి కాన్పూర్లో జరుగనున్నాయి.
టీమిండియా తరఫున వన్డేల్లో కీలక ఆటగాడిగా మారిన శ్రేయస్ అయ్యర్‌ను ఆసియా కప్-2025కు ఎంపిక చేయకపోవడంపై తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. సెలక్షన్ కమిటీ తీరుపై మాజీలు, క్రికెట్ అభిమానులు అసహనం వ్యక్తం చేశారు.
ఆసియా కప్-2025కు శ్రేయస్ అయ్యర్‌ను ఎంపిక చేయకపోవడం పట్ల క్రికెట్ వర్గాల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. తాజా ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ అద్భుతంగా రాణించాడు. శ్రేయస్ 2025 ఐపీఎల్‌లో 17 మ్యాచ్‌ల్లో 175 స్ట్రైక్ రేట్‌తో 50.33 సగటుతో 604 పరుగులు చేశాడు.
వచ్చే నెలలో దుబాయ్ వేదికగా జరగబోయే ఆసియా కప్-2025 కోసం అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ టీమిండియా జట్టు సభ్యులను ప్రకటించింది. మొత్తం 15 మంది సభ్యులతో కూడిన జట్టును సెలక్షన్ కమిటీ ప్రకటించింది.
స్టైలిష్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌కు మరో పరాభవం ఎదురైంది. ఐపీఎల్-2025 ట్రోఫీని తృటిలో చేజార్చుకున్న అయ్యర్.. ఈసారి మరో కప్పును మిస్ చేసుకున్నాడు. దీని గురించి మరింతగా తెలుసుకుందాం..
స్టైలిష్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ మరోమారు అదరగొట్టాడు. అతడి సారథ్యంలో ఇంకో జట్టు ఫైనల్స్‌కు చేరుకుంది. ఐపీఎల్ ట్రోఫీ మిస్ అయిన అయ్యర్.. ఈసారి మాత్రం కప్ వదలొద్దనే కసితో కనిపిస్తున్నాడు.
టీమిండియా స్టైలిష్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఎప్పటికప్పుడు తన టాలెంట్‌ను ప్రూవ్ చేసుకుంటూ వస్తున్నాడు. బ్యాటర్‌గానే కాదు.. కెప్టెన్‌గానూ తాను తోపు అని నిరూపిస్తున్నాడు.
పంజాబ్ కింగ్స్ స్టార్ బ్యాటర్ శశాంక్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. చెంప పగులగొట్టినా తప్పు లేదన్నాడు. మరి.. శశాంక్ ఇలా ఎందుకు మాట్లాడాడో ఇప్పుడు చూద్దాం..