Shreyas Iyer Injury Update: శ్రేయస్ అయ్యర్ హెల్త్‌పై బీసీసీఐ అప్‌డేట్
ABN , Publish Date - Oct 30 , 2025 | 09:58 AM
ఆస్ట్రేలియా టూర్ లో టీమిండియా స్టార్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ కు పెద్ద గాయమైన సంగతి తెలిసిందే. సిడ్నీ గ్రౌండ్ లో జరిగిన మూడో వన్డే సందర్భంగా ఆసీస్ ప్లేయర్ అలెక్స్ కారీ క్యాచ్ ను పట్టుకునే క్రమంలో అయ్యర్ కింద పడిపోయాడు. ఈ క్రమంలో అతడి పక్కటెములకు గాయమైంది.
క్రీడా వార్తలు: ఆస్ట్రేలియా టూర్ లో టీమిండియా స్టార్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer)కు పెద్ద గాయమైన సంగతి తెలిసిందే. సిడ్నీ గ్రౌండ్ లో జరిగిన మూడో వన్డే సందర్భంగా ఆసీస్ ప్లేయర్ అలెక్స్ కారీ క్యాచ్ ను పట్టుకునే క్రమంలో అయ్యర్ కింద పడిపోయాడు. ఈ క్రమంలో అతడి పక్కటెములకు గాయమైంది. అతడిని వెంటనే సిడ్ని ఆస్పత్రికి(Sydney Hospital) తరలించగా.. అంతర్గతంగా రక్త స్రావమైనట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం అతడు సిడ్నీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో తాజాగా శ్రేయస్ అయ్యర్ హెల్త్ గురించి బీసీసీఐ మరో కీలక అప్ డేట్ ఇచ్చింది.
'శ్రేయస్(Shreyas Iyer) ఆరోగ్య పరిస్థితిని మేము పర్యవేక్షిస్తున్నాము. అతడి విషయంలో వైద్యుల సలహాను పాటిస్తాము. ప్రస్తుతానికి అతడికి పెద్ద ప్రమాదం ఏమిలేదు. అతను జనవరిలో దక్షిణాఫ్రికాతో జరిగే సిరీస్ కు ఆడటానికి ఫిట్‌గా ఉంటాడని ఆశిస్తున్నాము. అతను ఇంటికి వెళ్లడానికి ఫిట్ అయ్యే వరకు అతను సిడ్నీలోనే ఉంటాడు' అని బీసీసీఐ(BCCI) వర్గాలు వెల్లడించాయి. అతను ప్రస్తుతం ఐసీయు నుంచి బయటకు వచ్చి.. నార్మల్ వార్డులో ఉన్నాడని, జనవరి 2026 వరకు అతను తిరిగి ఆటలోకి రాలేడని బీసీసీఐ తెలిపింది.
శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer) ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఇండియాకు రానున్నాడు. అయితే స్వదేశానికి వచ్చాక.. అతడు గ్రౌండ్ లోకి రావడానికి నాలుగు నుంచి ఆరు వారాలు పట్టవచ్చని వైద్యులు అభిప్రాయ పడుతున్నారు. నవంబర్ 30 నుంచి భారత్ లో సౌతాఫ్రికా సిరీస్(South Africa Series) జరగనుంది. దీనికి అయ్యర్ దూరమయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
Also Read:
Women's World Cup2025: 8 ఏళ్ల హిస్టరీ.. భారత్ రిపీట్ చేసేనా?
సూర్య బ్యాట్‌తోనే సమాధానం ఇస్తాడు: అభిషేక్ నాయర్