Home » Secunderabad
ఆంధ్రప్రదేశ్, తెలంగాణా(Andhra Pradesh, Telangana) రాష్ట్రాల్లో పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లకు అదనపు హాల్ట్ కల్పించినట్లు దక్షిణ రైల్వే(Southern Railway) ఒక ప్రకటనలో తెలిపింది.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో కోణార్క్ ఎక్స్‌ప్రెస్(Konark Express) రైలులో తనిఖీలు చేసిన జీఆర్‌పీ పోలీసులు ఓ వ్యక్తి నుంచి రూ 14.07 లక్షల విలువ చేసే 56.285 కిలోల గంజాయిని పట్టుకున్నారు.
గుట్టుగా నకిలీ నోట్లు ముద్రించి మార్కెట్‌లో చలామణి చేసి సొమ్ము చేసుకుంటున్న నిందితుడిని సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు(Central Zone Task Force Police) పట్టుకున్నారు.
తల్లి మృతదేహంతో 8 రోజుల పాటు ఇద్దరు కుమార్తెలు జీవనం సాగించిన కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఉస్మానియా యూనివర్శిటీ(Osmania University) పరిధిలో నివసించే లలిత భర్త రాజు ఓ హత్య కేసులో నిందితుడిగా మారడంతో ఐదేళ్ల క్రితం వారు విడిపోయారు.
మహా కుంభమేళాకు వెళ్లాలనుకునే భక్తుల కోసం మరో 6 ప్రత్యేకరైళ్లను నడపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) ప్రకటించింది. ఇందులో ఒక ప్రత్యేక రైలు ఫిబ్రవరి 14న బీదర్ నుంచి దానాపూర్‌కు, తిరుగు ప్రయాణంలో మరో ప్రత్యేకరైలు ఫిబ్రవరి 16న దానాపూర్ నుంచి చర్లపల్లి(Cherlapalli)కి నడపనున్నారు.
మహా కుంభమేళాకు వెళ్లాలనుకునే భక్తులకోసం మరో 4 ప్రత్యేకరైళ్లను నడపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) ప్రకటించింది. ఇందులో రెండు ప్రత్యేక రైళ్లు ఫిబ్రవరి 5, 7 తేదీల్లో చర్లపల్లి నుంచి దానాపూర్‌కు, 7, 9 తేదీల్లో మరో రెండు రైళ్లు తిరుగు ప్రయాణంలో దానాపూర్ నుంచి చర్లపల్లి(Danapur to Cherlapalli)కి రానున్నాయి.
‘మహా కుంభమేళా పుణ్యక్షేత్ర యాత్ర’ పేరుతో భారత్ గౌరవ్ పర్యాటక రైలును సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి సోమవారం ప్రారంభమైంది. ఈ రైలును యాత్రికుల్లో ఒకరైన తపన్ చంద్ర(77) ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(ఐఆర్‌సీటీసీ) గ్రూప్ జనరల్ మేనేజర్ పి. రాజ్ కుమార్ సమక్షంలో జెండా ఊపి ప్రారంభించారు.
భారతీయ రైల్వేకు స్టేషన్ల ద్వారా ప్రతి సంవత్సరం కోట్లాది రూపాయలు వస్తున్నాయి. అయితే రైల్వేకు ఆదాయం ఎలా వస్తుంది, ఏ రైల్వే స్టేషన్ నుంచి ఎక్కువగా వస్తుందనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్(Secunderabad Railway Station)కు కూతవేటు దూరంలో ఉన్న మల్కాజిగిరి రైల్వేస్టేషన్(Malkajgiri Railway Station) అభివృద్ధితో రూపురేఖలు మారనున్నాయి. అమ్రిత్ భారత్ స్టేషన్ సికింద్రాబాద్‌స్కీంలో భాగంగా ఇప్పటికే పలు అభివృద్ధి పనులకు సంబందించి నిర్మాణాలు చకచక జరిగిపోతున్నాయి.
అధునాతన సౌకర్యాలతో ఇటీవల ప్రారంభమైన చర్లపల్లి టెర్మినల్(Cherlapalli Terminal) నుంచి చెన్నై, గోరఖ్‌పూర్ వెళ్లే రెండు రైళ్ల తేదీలను అధికారులు ఖరారు చేశారు. మార్చి 7వ తేదీ సాయంత్రం 16.45 గంటలకు చెన్నై సెంట్రల్ నుంచి బయలుదేరే (నం. 12603) రైలు 8వ తేదీ ఉదయం 5.40 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది.