Home » Secunderabad
అయోధ్య-కాశీ పుణ్యక్షేత్ర యాత్ర కోసం ఐఆర్‌సీటీసీ ఆధ్వర్యంలో భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలును నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ రైలు సెప్టెంబరు 9న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఉదయం 11 గంటలకు ప్రారంభం అవుతుందని సీపీఆర్‌ఓ శ్రీధర్ తెలిపారు.
చర్లపల్లి నుంచి చెన్నై వెళ్లే సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్(12604)కు నాయుడుపేట్‌లో అదనపు స్టాపేజీ కల్పించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈరోజు నుంచి నాయుడుపేట్ రైల్వే స్టేషన్‌లో రెండు నిమిషాల పాటు రైలు ఆగుతుందని (హాల్టింగ్) దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.
ప్రయాణికుల రద్దీ దృష్ట్యా చర్లపల్లి-కాకినాడ నాందేడ్-తిరుపతి మధ్య వీక్లీ స్పెషల్ రైళ్లను పొడిగించినట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.
దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ అరాచకాలు తవ్వేకొద్దీ బయటికి వస్తున్నాయి. తాజాగా, డాక్టర్ నమ్రతకు చెందిన 8 బ్యాంక్ అకౌంట్లను పోలీసులు సీజ్ చేశారు.
ప్రయాణికుల రద్దీని నియంత్రించడానికి సికింద్రాబాదు- మైసూర్-సికింద్రాబాద్ (వయా గుంతకల్లు) ప్రత్యేక బైవీక్లీ ఎక్స్ప్రెస్ను నడపనున్నట్లు రైల్వే అధికారులు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. సికింద్రాబాదు-మైసూర్ బైవీక్లీ ప్రత్యేక రైలు (07033) ఈ నెల 8 నుంచి 29 వరకూ సోమ, శుక్రవారాలలో నడపనున్నారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో పునరాభివృద్ధి పనులు కొనసాగుతున్నందున వేర్వేరు ప్రాంతాల నుంచి అక్కడికి వచ్చే పలు రైళ్లను అక్టోబరు 19వ తేదీ వరకు ఇతర స్టేషన్లకు మళ్లిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.
సృష్టి కేసు వ్యవహారంలో ఏ1 నిందితురాలు డాక్టర్ నమ్రతను రెండవ రోజు కస్టడీలో భాగంగా పోలీసులు విచారించనున్నారు. మొదటి రోజున విచారణకు సహకరించకుండా తప్పించుకునే ప్రయత్నం చేసిన డాక్టర్ నమ్రత నుంచి కీలక విషయాలు రాబట్టేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.
సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ అరాచకాలపై మానవ హక్కుల కమిషన్(HRC) సీరియస్ అయింది. ఈ కేసును సుమోటోగా స్వీకరిస్తూ.. ఆగస్టు 28లోపు పూర్తి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.
ఐవీఎఫ్ మార్గంలో సంతానం పొందాలని ఆశించిన దంపతులను మోసం చేసిన సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వాహకురాలు డాక్టర్ నమ్రతను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఈ కేసు ఎఫ్ఐఆర్ కాపీలో నమోదు చేసిన సంచలన విషయాలు ఏబీఎన్ చేతికొచ్చాయి.
'సృష్టి' కేసులో అరెస్టయిన నిందితులను ఆదివారం మారేడుపల్లి జడ్జి నివాసంలో పోలీసులు ప్రవేశపెట్టారు. విచారణ అనంతరం న్యాయూర్తి నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించారు.