Home » Schools
ఈ సంవత్సరం మార్చిలో జరిగే పదో తరగతి పరీక్షల ఫీజు గడువును ప్రభుత్వం మరోసారి పొడిగించింది.
వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు పునః ప్రారంభమయ్యే సమయంలో ‘తల్లికి వందనం’ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. గురువారం కేబినెట్ సమావేశంలో దీనిపై కీలక చర్చ జరిగింది.
బాగా చదవమని ప్రోత్సహించాల్సిన గురువే నీకు చదువు రాదంటూ హేళనగా మాట్లాడడంతో ఓ గురుకుల విద్యార్థిని భవనంపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
రాష్ట్రంలోని ప్రజలందరికీ పైపులైన్ ద్వారా సురక్షిత తాగునీటిని అందించాలన్న లక్ష్యంతో ప్రారంభమైన పథకం.. మిషన్ భగీరథ. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రతిష్ఠాత్మకంగా చేపట్టింది.
నిర్మల్ జిల్లా: అధికారుల నిర్లక్ష్యం.. ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలల్లో చదువుకుంటున్న నిరుపేద విద్యార్థులకు శాపంగా పరిణమిస్తోంది. తాజాగా నిర్మల్ జిల్లా, దిలావర్ పూర్‌లోని కస్తూరిభా బాలికల ఆశ్రమ పాఠశాలలో ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి. భోజనం సరిగా పెట్టడం లేదని విద్యార్థులు చెబుతుండడంతో పిల్లలను తల్లిదండ్రులు వారి ఇళ్లకు తీసుకువెళుతున్నారు.
చలి తీవ్రత పెరిగిన నేపథ్యంలో స్కూళ్లకు 15 రోజులు సెలవులు ప్రకటించారు. హర్యానా ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. జనవరి 16 నుంచి మళ్లీ పాఠశాలల్లో రెగ్యులర్ తరగతులు ప్రారంభం కానున్నాయి.
AP Govt: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. చాగంటి కోటేశ్వరరావుకు మరో కీలక బాధ్యతను అప్పగించింది. ఇప్పటికే కేబినెట్ హోదాలో సలహాదారు పదవిలో ఉన్న చాగంటికి సర్కారు అప్పగించిన ఆ బాధ్యత ఏంటో ఇప్పుడు చూద్దాం..
మోడల్ స్కూళ్లలో అడ్మిషన్ల కోసం జనవరి 6వ తేదీ నుంచి ఫిబ్రవరి 28వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్‌నారాయణపురం మండలం సర్వేల్ గురుకుల పాఠశాలలో వేడి రాగి జావ మీద పడి ఇద్దరు విద్యార్థులకు గాయాలైన ఘటనలో ఆ గురుకులం ప్రిన్సిపాల్ వెంకటేశంపై సస్పెన్షన్ వేటు పడింది. విద్యార్థులకు అల్పాహారం అందించే విషయంలో ప్రిన్సిపాల్ నిర్లక్ష్యం, పర్యవేక్షణాలోపం ఉందని భావిస్తూ ఆయనను సస్పెండ్ చేస్తున్నట్లు కలెక్టర్ హనుమంతరావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో అసలేం జరుగుతోంది? పిల్లలు విష పురుగుల బారిన పడి మృతిచెందిన ఘటనలు వరుసగా జరుగుతున్నా యంత్రాంగంలో చలనం లేదెందుకు?