Home » Sankranthi festival
కాచిగూడ, చర్లపల్లి నుంచి శ్రీకాకుళం వరకు నడపనున్న ప్రత్యేక రైళ్లల్లో ఇంకా వందల సంఖ్యలో బెర్తులు ఖాళీగానే ఉన్నాయి. పండుగ రోజుల్లో ఊరు వెళ్లాలనుకునేవారికి నిజంగా ఇది పండుగలాంటి వార్తగానే చెప్పుకోవాలి. జనవరి 14, 15 తేదీల్లో మీరు హైదరాబాద్ నుంచి విశాఖపట్టణం వైపు వెళ్లాలంటే ఎలాంటి చింత అవసరం లేదు. జనరల్ కేటగిరీలో వందల సీట్లు ఖాళీగా ఉన్నాయి.
సంక్రాంతి సందర్భంగా పలు ప్రాంతాలకు వెళ్లి వచ్చే ప్రయాణికుల కోసం 52 ప్రత్యేక రైళ్లను నడిపేందుకు ఏర్పాట్లు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.
ముత్యాల ముగ్గులతో పుడమి పులకించింది. రంగురంగుల రంగవల్లులతో సంక్రాంతి శోభ ముందే వచ్చేసింది! ‘‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ నిర్వహిస్తున్న సంతూర్ ముత్యాల ముగ్గుల పోటీలు..
రాష్ట్రంలో సంప్రదాయ, సాహస జల్లికట్టు(Jallikattu) పోటీలను శనివారం పుదుకోట జిల్లా తచ్చంకుర్చిలో రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి ఎస్.రఘుపతి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి వి.మెయ్యనాథన్ జెండా ఊపి ప్రారంభించారు.
సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకొని వివిధ రైల్వేస్టేషన్ల నుంచి కాకినాడకు 6 ప్రత్యేకరైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
TGSRTC: సంక్రాంతి పర్వదినం పురస్కరించుకొని... హైదరాబాద్ నుంచి తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది.
సంక్రాంతి పండగకు సొంతూళ్లకు వెళ్లేందుకు హైదరాబాద్ వాసులు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో పండగ రద్దీని తట్టుకునేందుకు తెలంగాణ ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేస్తున్నారు.
రాష్ట్రంలో జల్లికట్టు పోటీల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. రాష్ట్రంలో జనవరి 14వ తేది పొంగల్ వేడుకల్లో భాగంగా జల్లికట్టు పోటీలు నిర్వహిస్తుంటారు. మదురై అవనియాపురం, పాలమేడు, అలంగానల్లూర్(Madurai Avaniyyapuram, Palamedu, Alanganallur) తదితర ప్రాంతాల్లో జరిగే జల్లికట్టు పోటీలు చూసేందుకు దేశ, విదేశాల నుంచి ప్రజలు తరలివస్తుంటారు.
Telangana: సంక్రాంతి పండగ పలువురి కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది. ఎంతో ఉత్సాహంతో గాలిపటాలు ఎగురవేసిన పలువురు యువకులు, చిన్నారులు అనుకోకుండా మృత్యువుబారిన పడ్డారు. కొందరు గాలిపటాలు విద్యుత్ తీగలకు ఇరుక్కుని విద్యుత్ షాక్‌తో ప్రాణాలు కోల్పోగా, మరికొందరు గాలిపటాలు ఎగురవేస్తూ భవనాల పైనుంచి పడి మృతి చెందారు.
Andhrapradesh: అతిధి మర్యాదలకు పెట్టింది పేరు గోదావరి జిల్లాలు. అటువంటి గోదావరి జిల్లాల ఘనమైన మర్యాదను విజయవాడకు చెందిన లోకేష్ సాయి అనే వ్యక్తి తన అత్తవారింటికి వచ్చి దక్కించుకున్నాడు.