Home » Sanju Samson
పెద్దగా అంచానాల్లేని సంజూ శాంసన్ ఈడెన్ గార్డెన్స్‌లో టీమిండియాకు ఆపద్భాందవుడిలా నిలిచాడు. అద్భుత బ్యాటింగ్‌తో భారత జట్టును సెమీ ఫైనల్ చేర్చాడు. చిరస్మరణీయ ఇన్నింగ్స్‌తో కోట్లాది మంది అభిమానుల మనసులు గెలుచుకున్నాడు.
టీ20 ప్రపంచ కప్ సూపర్ 8లో జింబాబ్వేతో జరిగిన కీలక పోరులో టీమిండియా 72 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో సెమీస్ ఆశలు సజీవంగా నిలుపుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా తీసుకున్న ఓ సాహసోపేతమైన నిర్ణయం గురించి ప్రస్తుతం చర్చ నడుస్తోంది.
టీ20 ప్రపంచకప్ 2026లో టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ చెత్త ఫామ్ కొనసాగుతోంది. ఈ టోర్నీలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో (యూఎస్‌ఏ, పాకిస్థాన్, నెదర్లాండ్స్) డకౌట్లైన అభిషేక్.. హ్యాట్రిక్ డకౌట్ల అపఖ్యాతిని మూటగట్టుకున్నాడు.
టీ20 ప్రపంచ కప్-2026 కోసం అందరూ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అలానే ఇటీవల టీమిండియా ఓపెనింగ్ స్థానంలో పలు కీలక పరిణామాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఓపెనర్లుగా ఎవరు వస్తారనే సందేహం క్రికెట్ అభిమానుల్లో వ్యక్తమవుతోంది.
న్యూజిలాండ్‌తో ఆఖరి టీ20 ఆడడానికి టీమిండియా తిరువనంతపురం చేరుకుంది. ఎయిర్‌పోర్ట్ నుంచి బయటకు వస్తున్న సమయంలో టీమిండియా ప్లేయర్ల మధ్య ఓ సరదా సన్నివేశం చోటు చేసుకుంది. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
టీమిండియా ఓపెనర్, వికెట్ కీపర్ సంజూ శాంసన్ ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. దీంతో దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లీ సరసన చేరాడు. గువాహటి మ్యాచ్‌లో సంజూ గోల్డెన్ డకౌటైన అయిన సంగతి తెలిసిందే. భారత్ తరఫున అత్యధిక గోల్డెన్ డకౌట్లైన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు.
టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ పేలవ ప్రదర్శన కనబరుస్తున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి మూడు టీ20ల్లో 10, 6, 0 పరుగులతో సంజు తీవ్రంగా నిరాశపర్చాడు. ఈ నేపథ్యంలో టీమిండియా సీనియర్ క్రికెటర్ అజింక్య రహానే అతడికి పలు కీలక సూచనలు చేశాడు.
టీ20 ప్రపంచ కప్ 2026కు ముందు టీమిండియా అభిమానులకు గుడ్ న్యూస్. అనూహ్యంగా సర్జరీ వల్ల జట్టుకు దూరమైన స్టార్ ప్లేయర్ తిలక్ వర్మ న్యూజిలాండ్‌తో చివరి టీ20 నాటికి పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తాడనే వార్తలు వస్తున్నాయి. టీ20 వరల్డ్ కప్ 2026కు తిలక్ అందుబాటులో ఉంటాడని తెలుస్తోంది.
న్యూజిలాండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో టీమిండియా అద్భుత ప్రదర్శనలతో అదరగొడుతుంది. టాపార్డర్‌లో అందరూ రాణిస్తున్నప్పటికీ.. కొంత ఆందోళన కలిగిస్తోంది మాత్రం వికెట్ కీపర్, బ్యాటర్ సంజూ శాంసన్ బ్యాటింగ్ మాత్రమే. ఈ విషయంపై మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ మాట్లాడాడు.
భారత టీ20 టీ20 జట్టులో తన స్ధానాన్ని పదిలం చేసుకున్న సంజూ శాంసన్.. ఇప్పుడు వన్డే జట్టులోకి కూడా రావాలని తహతహలాడుతున్నాడు. వాస్తవానికి సంజూకు వన్డేల్లో అద్భుతమైన రికార్డు ఉంది. ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్ ఇప్పటివరకు ఇండియా తరఫున 16 వన్డేలు ఆడి 56.67 సగటుతో 510 పరుగులు చేశాడు. ఈ క్రమంలో ఓ సంచలన నిర్ణయం తీసుకున్నాడు.