Home » sajjanar
అసభ్యకరమైన కంటెంట్ చేస్తూ సభ్య సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారని సీపీ ప్రశ్నలు సంధించారు. తక్షణమే వీడియోలు డిలీట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
సద్దుల బతుకమ్మ ఈనెల 30న, దసరా అక్టోబర్ 2న ఉన్నందున.. ఈ నెల 27 నుంచే సొంతూళ్లకు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశముండటంతో ఆ మేరకు ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచనుంది. అలాగే, తిరుగు ప్రయాణానికి సంబంధించి అక్టోబర్ 5, 6వ తేదీల్లోనూ రద్దీకి అనుగుణంగా బస్సులను సంస్థ ఏర్పాటు చేసింది.
ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ముఖ్యమంత్రా లేక మంత్రినా..? ఓ నియంతలా వ్యవహరిస్తున్నారు. ఆయన ఇకనైనా పద్ధతి మార్చుకోవాలి’ అంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఆర్టీసీలో త్వరలో 3,038 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడనున్నట్లు సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు.
పర్యాటక రంగ అభివృద్ధిలో భాగంగా ఆర్టీసీకి ఇచ్చే శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన కోటాను టీటీడీ పునరుద్ధరించాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కోరారు.
విధి నిర్వహణలో ఆర్టీసీ సిబ్బంది నిజాయితీని నిరూపించుకున్నారు. బస్సుల్లో ప్రయాణికులు పొగొట్టుకున్న రూ.19 లక్షల విలువైన వస్తువులతో కూడిన బ్యాగులను వారికి అందజేసి మానవత్వం చాటుకున్నారు.
మొరాకోలో ఇటీవల జరిగిన ’వరల్డ్ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రి’లో కూకట్‌పల్లి డిపోకు చెందిన కండక్టర్ బానోత్ మోహన్ కుమారుడు అకీరా నందన్ సత్తా చాటాడు.
TGSRTC Tampering Case: తెలంగాణ ఆర్టీసీలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. గత అక్డోబర్‌లో సరైన పత్రాలు లేవని ఓ బోరుబండిని పోలీసులు సీజ్ చేశారు. ఆ తర్వాత ఆ బండిలోని ఇంజిన్, ఛాసిన్ నంబర్లను సదరు యాజమాని మార్చినట్లు గుర్తించారు. ఈ వ్యవహారంలో ఆర్టీసీ సిబ్బందిపై పలు ఆరోపణలు వచ్చాయి. ఆర్టీసీ సిబ్బంది కాసుల కోసం కక్కుర్తి పడి ఈ వ్యవహారం నడిపించినట్లు ఆరోపణలు వచ్చాయి.
ఓ యువకుడి డేంజరస్ స్టంట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. రైలు పట్టాలపై యువకుడు చేసిన విన్యాసంపై తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ స్పందించారు. వీడియోను షేర్ చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు..
బీఆర్ఎస్ రజతోత్సవాల నేపథ్యంలో ఈనెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో చేపట్టనున్న భారీ బహిరంగసభ కోసం ఆ పార్టీ చర్యలు ముమ్మరం చేసింది.