CP Sajjanar On Messi: సహకరించండి.. మెస్సీ భద్రతపై సీపీ సజ్జనార్ కామెంట్స్
ABN , Publish Date - Dec 13 , 2025 | 04:24 PM
ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సి హైదరాబాద్‌కు చేరుకున్నారు. గోట్ ఇండియా టూర్‌లో భాగంగా లియోనల్ మెస్సీతో పాటు రోడ్రిగో, లూయిస్ హైదరాబాద్‌కు వచ్చారు.
హైదరాబాద్: ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సి హైదరాబాద్‌కు చేరుకున్నారు. గోట్ ఇండియా టూర్‌లో భాగంగా లియోనల్ మెస్సీతో పాటు రోడ్రిగో, లూయిస్ హైదరాబాద్‌కు వచ్చారు. ఎయిర్‌పోర్ట్ నుంచి ఫలక్‌నుమా ప్యాలెస్‌కు వెళ్తారు. రాత్రి 7 గంటల వరకు ప్యాలెస్‌లోనే ఉండనున్నారు. ఈ నేపథ్యంలో ఫలక్‌నుమా ప్యాలెస్ వద్ద భారీ భద్రత ఏర్పాట్లు చేశామని హైదరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. ఎయిర్‌పోర్టు నుంచి ఫలక్‌నుమా ప్యాలెస్ వరకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ప్యాలెస్‌లో సుమారు 250 మంది మెస్సీని కలుస్తారని, వారందరికి ముందుగానే క్యూ ఆర్ కోడ్ పాస్‌లు ఇచ్చామని తెలిపారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫలక్ నుమా ప్యాలెస్‌లో మెస్సీని కలవనున్నట్లు తెలిపారు. రెండు గంటల పాటు మెస్సీ ప్యాలెస్‌లో ఉంటారని చెప్పారు. గతంలో బెంగాల్‌లో చోటుచేసుకున్న సంఘటనల నేపథ్యంలో భద్రతను మరింత పటిష్టం చేశామన్నారు. పాస్‌లు తీసుకున్న వారి పూర్తి వివరాలు పోలీసుల దగ్గర ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమం సాఫీగా సాగడానికి హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్‌లు పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టి పనిచేస్తున్నాయని వెల్లడించారు. సిటీ పోలీస్ అధికారులు, ప్రజలు ఈవెంట్ సక్సెస్ అవ్వడానికి ప్రభుత్వంతో సహకరించాలని సీపీ సజ్జనార్ పిలుపునిచ్చారు.
ఇవీ చదవండి:
లియోనల్ మెస్సికి సారీ చెప్పిన సీఎం మమతా బెనర్జీ
మ్యాచ్ ఆడకుండా వెళ్లిపోయిన మెస్సి.. ఫ్యాన్స్ ఆగ్రహం!