Home » RSS
ఆర్ఎస్ఎస్ కు సంబంధించి తాను చేసిన వ్యాఖ్యలపై బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, ఇవి తమ కుటుంబానికి కొత్తవి కాదని, తన పోరాటాన్ని ఆపేది లేదని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు, కర్ణాటక ఐటీబీటీ శాఖల మంత్రి ప్రియాంక్ ఖర్గే అన్నారు.
జాతీయ భద్రత విషయంలో భారత్ మరింత జాగ్రత్తగా.. బలంగా ఉండాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. నాగపూర్లో నిర్వహించిన విజయదశమి ర్యాలీ సందర్భంగా ఆయన పలు అంశాలపై మాట్లాడారు.
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఏర్పడి వందేళ్లు పూర్తయిన సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు. క్రమశిక్షణ, అంకితభావంతో దేశానికి సేవ చేసే గొప్ప సంస్థ ఆర్‌ఎస్‌ఎస్ అని పవన్ కొనియాడారు.
రూ.100 నాణెంపై ఒకవైపు జాతీయ చిహ్నం (National Emblem) ముద్రించగా, మరోవైపు భరతమాత వరదముద్రతో సింహంతో సహా ఉన్న చిత్రం ముద్రించారు. స్వయం సేవకులు భరత మాత ముందు భక్తి, అంకితభావంతో ప్రణామం చేస్తున్నట్టు చిత్రీకరించారు.
ఆర్ఎస్ఎస్ ఆహ్వానంపై భారత ప్రధాన న్యాయమూర్తి బి.ఆర్. గవాయ్ తల్లి కమలతాయి గవాయ్ రాసిన లేఖ దేశవ్యాప్తంగా తీవ్ర వివాదాన్ని రేకెత్తించింది. విజయదశమి, ఆర్‌ఎస్‌ఎస్ శతజయంతి సందర్భంగా అమరావతిలో జరిగే..
మూడు వేల సంవత్సరాల పాటు ప్రపంచంలో ఎలాంటి ఘర్షణలు లేవని, టెక్నాలజీ ప్రగతి ఎంత గొప్పగా ఉన్నా పరిస్థితి క్షీణించలేదని, మానవ జీవితం సంతోషంగా, సంస్కారవంతంగా ఉండేదని మోహన్ భగవత్ అన్నారు.
సెప్టెంబర్‌లో తన 75వ పుట్టినరోజు తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ 'పదవీ విరమణ' చేస్తారనే ఊహాగానాలు నేపథ్యంలో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ స్పష్టత నిచ్చారు. 75 ఏళ్లకు పదవీ విరమణ చేయాలని ఎవరూ, ఎప్పుడూ చెప్పలేదే అని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ నేడు ఢిల్లీలో తేల్చి చెప్పారు.
ప్రతి భారతీయ జంటకు ముగ్గురు పిల్లలు ఉండాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. మూడు కంటే తక్కువ జనన రేటు ఉన్న సమాజాలు నెమ్మదిగా అంతరించిపోతున్నాయని ఆయన చెప్పారు.
పార్టీలకు అతీతంగా తనకు ఎందరో మిత్రులు, అనుచరులు ఉన్నారని, అందరి మనోభావాలను గౌరవిస్తానని డీకే శివకుమార్ తెలిపారు. తాను ఎవరికన్నా పెద్ద కాదని, కష్ట సమయంలో ఎవరున్నా వారికి అండగా నిలబడేందుకు తాను జీవితాంతం కట్టుబడి ఉంటానని చెప్పారు.
మూడు రోజుల పాటు ఆర్ఎస్ఎస్ నిర్వహించనున్న సమన్వయ సమావేశంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్, ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలె, సహ కార్యవాహ్‌లు (జాయింట్ జనరల్ సెక్రటరీలు), సమన్యయకర్తలతో సహా ఆర్ఎస్ఎస్ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు పాల్గోనున్నారు.