Share News

Mohan Bhagwat: విభిన్నతలను గౌరవించి జాతీయ ఐక్యతను బలోపేతం చేయాలి: RSS చీఫ్

ABN , Publish Date - Oct 02 , 2025 | 01:56 PM

జాతీయ భద్రత విషయంలో భారత్ మరింత జాగ్రత్తగా.. బలంగా ఉండాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. నాగపూర్లో నిర్వహించిన విజయదశమి ర్యాలీ సందర్భంగా ఆయన పలు అంశాలపై మాట్లాడారు.

Mohan Bhagwat:  విభిన్నతలను గౌరవించి జాతీయ ఐక్యతను బలోపేతం చేయాలి: RSS చీఫ్
RSS Chief Mohan Bhagwat

నాగపూర్, అక్టోబర్ 2: భారత్‌కు అసలైన స్నేహితులు ఎవరో, తమ పక్కన ఎవరు నిలబడగలరో పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్‌‌‌తో తేలిపోయిందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. జాతీయ భద్రత విషయంలో భారత్ మరింత జాగ్రత్తగా.. బలంగా ఉండాలని ఆయన అన్నారు. నాగపూర్లో నిర్వహించిన ఆర్ఎస్ఎస్ విజయదశమి ర్యాలీ సందర్భంగా మోహన్ భగవత్ పలు అంశాలపై మాట్లాడారు.


హిందూ సమాజం 'వసుధైవ కుటుంబకం' ఆదర్శాన్ని కాపాడుతూ, భారత్‌ను సమృద్ధిగా, ప్రపంచానికి దోహదపడే దేశంగా మార్చాలని భగవత్ పిలుపునిచ్చారు. సమాజంలో స్వార్థరహిత, పారదర్శకత కలిగిన రోల్ మోడల్స్‌ను సృష్టించాలని, విభిన్నతలను గౌరవించి జాతీయ ఐక్యతను బలోపేతం చేయాలని ఆయన సూచించారు.


ఇక పొరుగు దేశం నేపాల్‌లో ఇటీవల నెలకొన్న అశాంతి.. భారత్‌కు మంచి సంకేతం కాదని భగవత్ అన్నారు. ఇండియాలోనూ ఇలాంటి అల్లకల్లోలాలను సృష్టించేందుకు దేశ వ్యతిరేక శక్తులు.. లోపల, బయట పనిచేస్తున్నాయని ఆయన హెచ్చరించారు.

కాగా, ఆర్ఎస్ఎస్‌ను స్థాపించి నేటితో వందేళ్లు పూర్తైంది. 1925లో మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌కు చెందిన ఫిజిషియన్ కేశవ్ బలిరామ్ హెగ్డేవార్ దసరా పర్వదినాన రాష్ట్రీయ్ స్వయంసేవక్ సంఘ్‌ను స్థాపించారు. అప్పటి నుంచి ఆర్ఎస్ఎస్ తన ప్రస్థానాన్ని అప్రతిహతంగా కొనసాగిస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి..

బంగారం ధర తగ్గేదేలే.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

టాప్ ప్లేస్‌లో అంబానీ.. దేశంలో అత్యంత సంపన్నులు వీరే..

Read Latest Telangana News and National News

Updated Date - Oct 02 , 2025 | 02:07 PM