Home » Revanth
భారీ వర్షాల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను అలర్ట్ చేశారు. వర్షాలపై నిరంతరం మానిటర్ చేయాలని సూచించారు.
ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. టీపీసీసీ నూతన కార్యవర్గ ఖరారుపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయి కల్వకుంట్ల కవిత రాసిన లేఖ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారుతోంది. తాజాగా ఈ లేఖపై BRS ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ స్పందించారు.
తెలంగాణలో రేవంత్ సర్కారు చేసిన కులగణన అశాస్త్రీయమని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు. ముస్లింలలోని 10 శాతం మందిని బీసీలుగా చూపడం బీసీలకు అన్యాయమన్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి, బీజేపీ పెట్టిన వ్యక్తిగత కేసును కొట్టేయాలని హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దిగువ కోర్టులో విచారణను నిలిపివేస్తూ, తుది తీర్పు వరకు హాజరు నుండి మినహాయింపు ఇవ్వాలని కోరారు
ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద బేస్‌మెంట్ పూర్తి చేసిన 2,019 లబ్ధిదారుల ఖాతాల్లో రూ.20.19 కోట్లు నేరుగా జమ చేసినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. నాలుగు దశల్లో నిధులు విడుదల చేస్తామని, ప్రతి దశలో మొబైల్ యాప్ ద్వారా ఫొటోలు అప్‌లోడ్ చేసినా నిధులు అందుతాయని చెప్పారు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏప్రిల్ 16న జపాన్ పర్యటనకు బయల్దేరనున్నారు. ఈ పర్యటనలో ఆయనతో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, రాష్ట్ర అధికారుల ప్రతినిధి బృందం కూడా ఉంటారు. ఈ టూర్ ఏప్రిల్ 16 నుంచి 22 వరకు కొనసాగనుంది.
మంచిరేవులలో యంగ్ ఇండియా పోలీసు స్కూల్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. విద్యా రంగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా 'యంగ్ ఇండియా' అనే తన బ్రాండ్‌ను వెల్లడించారు
రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ఉగాది రోజున, మార్చి 30న, సీఎం రేవంత్ రెడ్డి హుజూర్‌నగర్‌లో ప్రారంభించనున్నారని పౌర సరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమం తర్వాత సీఎం రామస్వామి గట్టు వద్ద మోడల్ కాలనీ ఇళ్ల నిర్మాణం పరిశీలిస్తారు.
ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. ఎస్ఎల్‌బీసీ ప్రమాదం సహా అనేక అంశాలపై చర్చించారు.