Home » Ravichandran Ashwin
ఇంగ్లండ్‌తో లార్డ్స్ వేదికగా జరుగుతోన్న మూడో వన్డేకి భారత తుది జట్టు ఎంపికపై మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. వరుసగా మూడో మ్యాచ్‌లోనూ స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు అవకాశం ఇవ్వకపోవడాన్ని అతడు తప్పుబట్టాడు.
భారత యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీకి అంతర్జాతీయ అరంగేట్రం కల్పించిన తీరు సరైనదేనా? బీసీసీఐ, టీమ్ మేనేజ్‌మెంట్ సోషల్ మీడియా ఒత్తిడికి తలొగ్గాయా? అంటూ మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశ్నించాడు.
ఐర్లాండ్ చేతిలో 2-0 తేడాతో భారత్ ఓటమి పాలుకావడంపై మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లండ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు ముందు భారత బ్యాటర్లు ఐర్లాండ్ సిరీస్ నుంచి గుణపాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉందని తెలిపాడు.
దంబుల్లా అంతర్జాతీయ స్టేడియం వేదికగా భారత్ 'ఎ', శ్రీలంక 'ఎ' జట్ల మధ్య జరిగిన త్రైపాక్షిక సిరీస్ మ్యాచ్ పెను వివాదానికి దారితీసింది. దీనిపై టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు. శ్రీలంక మైండ్ గేమ్ ఆడిందంటూ కామెంట్స్ చేశాడు.
వైభవ్ సూర్యవంశీ భవిష్యత్తుపై టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వైభవ్ సూర్యవంశీ టెస్టు క్రికెట్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించాడు.
ఐపీఎల్ 2026 లీగ్ చివర్లో వరుసగా 3 మ్యాచ్‌ల్లో ఓడిపోయి చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించడం అభిమానులకు తీవ్ర నిరాశను మిగిల్చింది. టోర్నీ ఆరంభంలో అద్భుత విజయాలతో టాప్-4 రేసులో బలంగా కనిపించిన సీఎస్కే.. ముగింపు దశలో వరుస పరాజయాలతో టోర్నీ నుంచి వైదొలిగింది.
సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. అతడిని తప్పించి సంజు శాంసన్‌కు జట్టు పగ్గాలు అందించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌కు టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ మద్దతుగా నిలిచాడు.
ఐపీఎల్ 2026 టోర్నీ ఆరంభంలో వరుస విజయాలతో దూసుకెళ్లిన పంజాబ్ కింగ్స్.. ఇప్పుడు పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే ఈ సీజన్‌లో పంజాబ్.. రెండు హోం వేదికలను ఎంచుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పంజాబ్ కింగ్స్ యాజమాన్యం తీసుకున్న ఆ నిర్ణయంపై భారత మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ఐపీఎల్ 2026లో ఆర్సీబీ స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ అద్భుత ప్రదర్శనలు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో భువీని తిరిగి భారత జట్టులోకి తీసుకోవాలని టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, మాజీ చీఫ్ సెలక్టర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ డిమాండ్ చేశారు.
ఐపీఎల్ 2026 ఉత్సాహభరితంగా కొనసాగుతోంది. లీగ్ దశలో మరో 19 మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. కాగా ఇప్పటి వరకు ఒక్క టీమ్ కూడా ప్లే ఆఫ్స్‌కు చేరుకోలేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుత సీజన్‌లో ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించే జట్ల గురించి టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ మాట్లాడాడు.