Home » Raptadu
మండల పరిధిలోని సనప మాధవరాజుల స్వామి ఉత్సవాల సందర్భంగా పరిటాల రవీంద్ర మెమోరియల్ ట్రస్టు ఆధ్వర్యంలో రాతిదూలం లాగుడు పోటీలు ఉత్సాహంగా జరిగాయి. టీడీపీ మండల ఇనచార్జ్ బాలాజీ పోటీలను ప్రారంభించారు. జనరల్ విభాగానికి నిర్వహించిన పోటీల్లో 10 జతల ఎద్దులు పాల్గొన్నాయి. వందలాది మంది రైతులు జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చారు.
హంద్రీనీవా ద్వారా తన నియోజకవర్గంలోని 38 చెరువులకు నీరందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మంగళవారం ఆమె సీఎం ను ఆయన చాంబర్‌లో కలిసి వినతి పత్రం అందజేశారు. హంద్రీనీవా రెండో దశ లైనింగ్ పనులు చేయడం ద్వారా రాప్తాడు నియోజకవర్గంలోని 38 చెరువులకు నీరందే అవకాశం లేకుండా పోతుందన్నారు. భూగర్భజలాలు తగ్గే ప్రమాదం ఉందని వివరించారు. చెరువులు, ...
మండలంలోని దాదులూరు పోతలయ్య స్వామికి భక్తులు జ్యోతులు, బోనాలు సమర్పించి మెక్కు లు తీర్చుకున్నారు. దాదులూరు పరుషలో రెండో రోజైన సోమవారం పోతలయ్య, చెన్నకేశవ స్వామి, బంగారు లింగమయ్య స్వామికి ఫల హారపు బండ్లతో భక్తులు ఆలయ ప్రదక్షిణలు చేసి మెక్కులు తీర్చు కున్నారు.
ఇటీవల ప్రవేసపెట్టిన బడ్జెట్‌లో క్రైస్తవులకు పెద్దపీట వేయడం ఆనందదాయకమని టీడీపీ క్రిస్టియన సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఈటే స్వామిదాసు పేర్కొన్నారు. బడ్జెట్‌లో కైస్తవులకు పెద్దపీట వేయడంపై మండలంలోని నరసంపల్లి బేతేలు ప్రార్థన మంది రంలో ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు.
గ్రామీణ ప్రాంతాల సంప్రదాయ లు ఇటీలవ కాలంలో కనుమరుగవుతున్నాయని, వాటిని కాపాడుకోవాల్సిన బాద్యత మనపై ఉందని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. మండల పరిధిలోని బి. యాలేరు గ్రామంలో శివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకోని గురువారం పరిటాల రవ్రీంద్ర ట్రస్టు ఆధ్వర్యంలో రాతిదూలం లాగు డు పోటీలను నిర్వహించారు.
జిల్లా కేంద్రానికి కూత వేటు దూ రంలో ఉన్న మండలంలోని రాప్తాడు, ప్రసన్నాయపల్లి పశువైద్యశాలలకు పశు వైద్యాధికారులు, సిబ్బంది సకాలంలో హాజరు కారు. మధ్యాహ్నం తరువాత పూర్తిగా విధులకు డమ్మా కొడుతున్నారు.
పచ్చని ప్రకృతి రమణీ య దృశ్యాలతో పులకిస్తోంది కోనకణ్వాశ్రమం. ఉమ్మడి జిల్లాలో ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోంది. దీనిని న్యామద్దల కోన, గుట్టూరు కోన అని కూడా పిలుస్తారు. కణ్వమహర్షి తపస్సు చేసిన స్థలం కావున కోన కణ్వాశ్రమం అనే పేరు వచ్చినట్టు పెద్దలు చెబుతుంటారు. ఈ క్షేత్రంలో ప్రముఖంగా మల్వేశ్వరస్వామి, పాం డురంగస్వామి, అయ్య ప్పస్వామి ఆంజనేయ స్వామి ఆలయాలు ఉ న్నాయి.
ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయకత్వంలో గ్రామాల్లో రోడ్ల సమస్యలు లేకుండా చేస్తున్నామని ఎమ్మెల్యే పరిటాల సునీతఅన్నారు. మండలంలోని అక్కంపల్లి పంచాయితీ లో మధురానగర్, సదాశివన కాలనీలో ఆదివారం రూ.50లక్షలతో నిర్మిస్తు న్న సీసీరోడ్లకు భూమి పూజ చేపట్టారు. ఎమ్మెల్యే పరిటాల సునీత హాజరై రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన లోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని ఎమ్మెల్యే పరిటాల సునీత తెలిపారు. మండలంలోని అయ్య వారిపల్లిలో రూ. 40 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే శనివారం భూమి పూజ చేశారు.
వైసీపీ అసమర్థ పాలనకు సాక్ష్యం విరిగిన పేరూరు డ్యాం గేట్లే అని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. ఆమె సోమవారంమండలంలోని అప్పర్ పెన్నార్ (పేరూరు) డ్యాంను సందర్శించారు. మరమ్మతులకు గురైన డ్యాం గేట్లను పరిశీలించారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... వర్షపు నీటితో జలాశయం నిండిన సమయంలో జాగ్రత్తలు తీసుకోకుండా, అవగాహన లేకుండా గేట్లు ఎత్తి వాటిని విరిగ్గొ ట్టారని విమర్శించారు.