SP : మహిళలు ధైర్యంగా ముందుకు సాగాలి : ఎస్పీ
ABN , Publish Date - Mar 12 , 2025 | 12:38 AM
ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లోనూ రాణించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ముఖ్యంగా సమాజంలో ఎదురయ్యే సవాళ్లను దైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు పోవాలని ఎస్పీ వి.రత్న పిలుపు నిచ్చారు. టింబక్టుకలెక్టివ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో చెన్నేకొత్తపల్లిలో మంగళవారం అంతర్జాతీయ మహి ళా దినోత్స వాన్ని ఘనంగా నిర్వహించారు.
చెన్నేకొత్తపల్లి, మార్చి 11(ఆంధ్రజ్యోతి): ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లోనూ రాణించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ముఖ్యంగా సమాజంలో ఎదురయ్యే సవాళ్లను దైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు పోవాలని ఎస్పీ వి.రత్న పిలుపు నిచ్చారు. టింబక్టుకలెక్టివ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో చెన్నేకొత్తపల్లిలో మంగళవారం అంతర్జాతీయ మహి ళా దినోత్స వాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా మహిళలతో గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక టింబక్టు కార్యాలయం వద్ద నిర్వహించిన సమావేశానికి ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లా డారు. అనంతరం ప్రతిజ్ఞ చేయించారు. సంస్థ వ్యవప్థాపకులు మేరి వటమట్టం, ఏడీ సుకన్య, ధర్మవరం డీఎస్పీ హేమంతకుమార్, రామగిరి సీఐ శ్రీధర్, ఎస్‌ఐ సత్యనారాయణ, టింబక్టు మహిళా ప్రతినిధులు, సభ్యులు, లీడర్లు, సిబ్బంది, మహిళలు పాల్గొన్నారు.
నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టిసారించాలి
చెన్నేకొత్తపల్లి: మహిళలు, బాలికల నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టిసారించాలని శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ వి.రత్న ఆదేశించారు. చెన్నేకొత్తపల్లిలోని పోలీస్‌స్టేషనను మంగళవారం ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన పరిసరాలను పరిశీలించడంతో పాటు క్రైమ్ రికార్డులను తనిఖీ చేశారు. స్టేషనపరిధిలో జరిగే నేరాల గురించి ఆరాతీశారు. ఎస్పీ వెంట ధర్మవరం డీఎస్పీ హేమంతకుమార్ ఉన్నారు. రామగిరి సీఐ శ్రీధర్, ఎస్‌ఐ సత్యనారాయణ పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....