CHECK DAM: శిథిలమైన చెక్‌డ్యాంలు
ABN , Publish Date - Mar 19 , 2025 | 11:59 PM
మండలంలోని వరిమడుగు నుంచి పాలచెర్లకు వెళ్లే దారిలో పండమేరు వంకపై నిర్మించిన రెండు చెక్‌డ్యాంలు శిథిలమయ్యాయి. దీంతో ఆ దారి గుండా రైతులు ద్విచక్రవాహనాలు, ఇతర వాహనాల్లో రాకపోకలు సాగించేందుకు ఇబ్బంది పడుతు న్నారు. వరిమ డుగు నుంచి పాలచెర్లకు వెళ్లే దారిలో పండమేరు వంకపై నీటి ప్రవాహం కోసం, వాహనాలు వెళ్లేందుకు వీలుగా కొన్నేళ్ల కిందట చెక్‌డ్యాంలు నిర్మిం చారు.
- రైతులు, ప్రజల రాకపోకలకు ఇబ్బందులు
రాప్తాడు, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): మండలంలోని వరిమడుగు నుంచి పాలచెర్లకు వెళ్లే దారిలో పండమేరు వంకపై నిర్మించిన రెండు చెక్‌డ్యాంలు శిథిలమయ్యాయి. దీంతో ఆ దారి గుండా రైతులు ద్విచక్రవాహనాలు, ఇతర వాహనాల్లో రాకపోకలు సాగించేందుకు ఇబ్బంది పడుతు న్నారు. వరిమ డుగు నుంచి పాలచెర్లకు వెళ్లే దారిలో పండమేరు వంకపై నీటి ప్రవాహం కోసం, వాహనాలు వెళ్లేందుకు వీలుగా కొన్నేళ్ల కిందట చెక్‌డ్యాంలు నిర్మిం చారు. ప్రతి ఏడాది వర్షపు నీరు, హంద్రీనీవా నీరు ఈ చెక్‌డ్యాంల మీదుగా రాప్తాడు నుంచి అనంతపురం చెరువు లోకి వెళతాయి. ఈ ఏడాది ఖరీఫ్‌లో పండమేరు వంక ప్రాంతంలో భారీ వర్షాలు కురవడంతో పాటు, హంద్రీనీ వా నీరు ఎక్కువగా ప్రవహించడంతో నీటి ఉధృతికి ఆ చెక్‌డ్యాంలు దెబ్బతి న్నాయి. చెక్‌డ్యాంలు దెబ్బతినడంతో పెద్ద పెద్ద రాళ్లు దర్శనమిస్తున్నాయి.
రాకపోకలకు ఇబ్బందులు
మండలంలోని బోగినేపల్లి, పాలచెర్ల గ్రామాలకు చెందిన ప్రజలు వివిధ పనుల నిమిత్తం మండల కేంద్రమైన రాప్తాడుకు ఈ దారి గుండానే వెళ్లాలి. అలాగే వరిమడుగు ప్రజలు, రైతులు పొలాలకు వెళాలన్నా ఆ దారి గుండా వెళ్లాల్సిందే. రైతులు పండించిన పంటలన, పశుగ్రాసాన్ని పొలాల్లో నుంచి ఇంటి వద్దకు తరలించేందుకు ఆ దారి ఒక్కటే ఉంది. చెక్‌డ్యాంలు దెబ్బతిని ప్రస్తుతం ఆ దారి బాగా లేకపోవడంతో రాకపోకలకు ప్రజలు, రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పండమేరు వంకపై నీరు ప్రవహించే సమయంలో చెక్‌డ్యాం దారిలో గుంతలు, రాళ్లు ఉండటంతో ప్రమాదవశాత్తు కింద పడి గాయాల పాలవుతున్నారు.
మరమ్మతులు పట్టించుకోని గత పాలకులు
గత వైసీపీ ఐదేళ్ల పాలనలో చెక్‌డ్యాంలకు కనీస మరమ్మతులు కూడా చేయలేదు. ఈ ఏడాది భారీ వర్షాలు కురవడంతో నీటి ఉధృతికి రెండు చెక్‌డ్యాంలు పూర్తిగా దెబ్బతిని పెద్దపెద్ద రాళ్లు దర్శినమిస్తున్నాయి. ఇప్పుడైనా అధికారులు, పాలకులు స్పందించి చెక్‌డ్యాంలకు మరమ్మతులు చేయాలని వాహనదారులు, ప్రజలు కోరుతున్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....