Home » Rajya Sabha
బీజేపీకి 400 సీట్లకు పైనే రావచ్చంటూ కాంగ్రెస్ రాజ్యసభ నేత మల్లికార్జున్ ఖర్గే తన ప్రసంగంలో చేసిన వ్యాఖ్యలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పెద్దల సభలోనే ఛలోక్తులు విసిరారు. ఖర్గే ఇంత స్వేచ్ఛగా సభలో ఎక్కువ సేపు మాట్లాడటం తనను ఆశ్చర్యపరిచిందన్నారు. ఫోర్లు, సిక్సర్లు కొట్టారని చెప్పారు.
రాజ్యసభ అభ్యర్థులను వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మార్చివేశారు. గతంలో లీక్‌లు ఇచ్చిన ముగ్గురిలో ఒక అభ్యర్థిని మార్చేశారు. ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు స్థానంలో కడపకు చెందిన మేడా రఘునాథరెడ్డి పేరు జగన్ పరిశీలిస్తున్నట్టు సమాచారం. మొత్తం మూడు సీట్లలో పోటీ చేయాలని వైసీపీ నిర్ణయం తీసుకుంది..
MP Vijayasai Sensational Comments: ‘అవును.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది.. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చింది..’ ఇవీ రాజ్యసభ వేదికగా ఏపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన కామెంట్స్. ఈ మాటలు విన్న కాంగ్రెస్ ఎంపీలు నవ్వుకున్నారు. ఇక సోషల్ మీడియాలో అయితే ఈ వ్యాఖ్యలపై పెద్ద చర్చే నడుస్తోంది...
ఆమ్ ఆద్మీ పార్టీ నేత, డీసీడబ్ల్యూ మాజీ చీఫ్ స్వాతి మలివాల్ పార్లమెంటు సభ్యురాలిగా రాజ్యసభలో బుధవారంనాడు ప్రమాణస్వీకారం చేశారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల తొలిరోజు ఆమె ప్రమాణస్వీకారం చేసినప్పటికీ, ఒకసారి కాకుండా రెండు సార్లు ప్రమాణం చేయాల్సి వచ్చింది.
దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లోని 56 రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలను ప్రకటించింది. ఈ అన్ని స్థానాలకు వచ్చే నెల 27వ తేదీన ఓటింగ్ జరగనుంది.
రాజ్యసభ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాల నుంచి ఆరు స్థానాలకు ఎన్నిక నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురు, తెలంగాణ నుంచి ముగ్గురు రాజ్యసభ సభ్యుల పదవీకాలం ఏప్రిల్ నెలలో ముగియనుంది.
ఆమ్ ఆద్మీ పార్టీ భ్యులు సంజయ్ సింగ్, స్వాతి మలివాల్, ఎన్‌డీ గుప్తా ఏకగ్రీవంగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. సంజయ్ సింగ్, ఎన్‌డీ గుప్తా, సుశీల్ గుప్తాల రాజ్యసభ పదవీకాలం జనవరి 27తో ముగియనుంది. ఈ నేపథ్యంలో సింగ్, గుప్తాలను రెండోసారి రాజ్యసభకు పార్టీ నామినేట్ చేసింది. సుశీల్ గుప్తా స్థానంలో డీసీడబ్ల్యూ మాజీ చీఫ్ స్వాతి మలివాల్‌ను 'ఆప్' నామినేట్ చేసింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో జైలులో ఉన్న ఆప్ నేత సంజయ్ సింగ్ (Sanjay Singh) సోమవారం నాడు రాజ్యసభకు నామినేషన్ వేశారు. జైలు నుంచి భారీ భద్రత మధ్య సివిల్ లైన్స్ వద్దకు తన సహచర పార్టీ నేతలు స్వాతి మాలివాల్, ఎన్డీ గుప్తాలతో కలిసి వచ్చారు.
సిక్కిం నుంచి రాజ్యసభ అభ్యర్థి పేరును బీజేపీ ఖరారు చేసింది. డోర్జీ త్రేసింగ్ లేప్చాను పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. న్యూఢిల్లీ నుంచి 3, సిక్కిం నుంచి ఒక రాజ్యసభ స్థానానికి జనవరి 19న ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రకటించింది.
డీసీబ్ల్యూ చీఫ్ స్వాతి మలివాల్ రాజీనామాను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శనివారంనాడు ఆమోదించారు. దానిని వెంటనే లిఫ్టెనెంట్ గవర్నర్ ఆమోదానికి ఆయన పంపారు. ఢిల్లీ నుంచి రాజ్యసభ ఎన్నికల్లో ఆప్ అభ్యర్థిగా మలివాల్ ఉన్నారు. రాజ్యసభకు తన నామినేషన్ పత్రాన్ని సోమవారంనాడు ఆమె సమర్పించనున్నారు.