Share News

PM Modi: మన్మోహన్ సింగ్‌ను ప్రశంసించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే

ABN , Publish Date - Feb 08 , 2024 | 11:53 AM

ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi).. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌(Manmohan Singh)ను ప్రశంసించారు. రాజ్యసభలో పదవీ విరమణ చేస్తున్న సభ్యుల వీడ్కోలు సందర్భంగా ప్రధాని సభలో ప్రసంగించారు.

PM Modi: మన్మోహన్ సింగ్‌ను ప్రశంసించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే

ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi).. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌(Manmohan Singh)ను ప్రశంసించారు. రాజ్యసభలో పదవీ విరమణ చేస్తున్న సభ్యుల వీడ్కోలు సందర్భంగా ప్రధాని సభలో ప్రసంగించారు. మోదీ మాట్లాడుతూ.. మన్మోహన్ సింగ్ తన ఆరోగ్యం బాలేనప్పుడు కూడా వీల్ చైర్‌లో పని చేశారని గుర్తు చేశారు. ఒకానొక సమయంలో ఓటింగ్ సందర్భంగా మన్మోహన్ వీల్ చైర్‌లో వచ్చి ఓటు వేశారని ఆ ఘటన వృత్తిపట్ల తనకున్న నిబద్ధతకు తార్కాణంగా నిలిచిందని పేర్కొన్నారు.

పదవీ విరమణ చేయనున్న రాజ్యసభ సభ్యులకు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ ఢిల్లీలోని తన నివాసంలో గురువారం వీడ్కోలు ఇవ్వనున్నారు. ఈమేరకు ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో రాజ్యసభ సభ్యులు గ్రూప్ ఫొటోలు దిగారు. ఇవాళ సాయంత్రం 06.30కి పదవీ విరమణ వీడ్కోలు కార్యక్రమం జరగనుంది.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Feb 08 , 2024 | 02:54 PM