Home » Manmohan Singh
తెలంగాణ రాష్ట్ర బిల్లుపై సంతకం చేసి తమ గౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన మన్మోహన్ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలని ప్రధాని మోదీనిసీఎం రేవంత్‌రెడ్డి కోరారు. ఈ దేశం ఎప్పటికీ గుర్తుపెట్టుకునే భరతమాత ముద్దు బిడ్డకు భారతరత్న ఇవ్వడానికి ఈ ప్రభుత్వానికి ఎందుకు అభ్యంతరమో అర్థం కావడం లేదన్నారు.
మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ వల్లే మన దేశం ఇప్పుడు ఈ స్థాయిలో ఉందని సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. దేశం ఆర్థికంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టారని ఆయన గుర్తుచేశారు.
కోల్ స్కామ్ కేసులో మాజీ ప్రధాని దివంగత మన్మోహన్ సింగ్‌కు సుప్రీం కోర్టు క్లీన్ చిట్ ఇవ్వడంపై కాంగ్రెస్ నేత సోనియా గాంధీ మంగళవారం కీలక వ్యాఖ్యలు చేశారు.
బొగ్గు గనుల కేటాయింపుల కేసులో భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌పై ఉన్న క్రిమినల్ కేసును, సమన్ల ఉత్తర్వును సుప్రీంకోర్టు రద్దు చేసింది. ప్రత్యేక కోర్టు గతంలో జారీ చేసిన సమన్ల ఉత్తర్వులను కొట్టివేస్తూ కేసును శాశ్వతంగా క్లోజ్ చేసింది.
భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు సంబంధించిన ఓ ఉద్వేగభరిత ఉదంతాన్ని మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎస్.వై. ఖురేషీ తన కొత్త పుస్తకంలో రాసుకొచ్చారు. 'నువ్వు నా గురించి అలా అనుకుంటే నేను ఆత్మహత్య చేసుకుంటా' అని మన్మోహన్ సింగ్ తీవ్ర ఆవేదనతో అన్నట్లు ఖురేషీ పేర్కొన్నారు.
పాకిస్థాన్ నుంచి తాను న్యూఢిల్లీకి తిరిగిరాగానే డీబ్రీఫింగ్ ఎక్సర్‌సైజ్‌లో భాగంగా ఐబీ స్పెషల్ డైరెక్టర్ వీకే జోషి తనను న్యూఢిల్లీలోని ఓ హోటల్‌లో కలిశారని, ప్రధానిని కలిసి ఆ వివరాలు తెలియజేయాల్సిందిగా తనను కోరారని యాసిన్ మాలిక్ తెలిపారు.
పేద ప్రజలను గుర్తుంచుకుని నిర్ణయాలు తీసుకోవాలనే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సలహా ఎప్పటికీ ఆచరణీయమని ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు.
దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ స్మారకాన్ని నిర్మించే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది.
కొత్త విధానం ప్రకారం, మెమోరియల్ కోసం స్థలాన్ని ట్రస్టుకు మాత్రమే కేటాయించాల్సి ఉంటుంది. ఆ కారణంగా ప్రాజెక్టు ప్రారంభించడానికి ముందు ట్రస్టు ఏర్పాటు కావాలి. ట్రస్టు ఏర్పాటయిన వెంటనే భూమి కేటాయింపు కోసం దరఖాస్తు చేసుకోవాలి.
Manmohan Singh: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆకస్మిక మృతితో.. ఆయన భార్య గురుశరణ్ కౌర్ భద్రతపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకొంది.