Home » Rains
తెలంగాణ రాష్ట్రంలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఓవైపు కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, మరోవైపు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో తీవ్ర ఎండలు, హీట్‌వేవ్ ప్రభావం కొనసాగుతోంది.
ఆంధ్రప్రదేశ్‌లోని మరికొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. జూన్ 11వ తేదీకి రాష్ట్రంలో రుతుపవనాల పురోగతి కొనసాగుతోందని వెల్లడించారు.
రాబోయే మూడు గంటల్లో ఏపీలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ హెచ్చరించారు. వర్షాల నేపథ్యంలో విజయనగరం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు తెలిపారు.
రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం భారీ వర్షాలు కురిశాయి. నిన్నటిదాకా ఉక్కపోతతో అల్లాడిన ప్రజానీకానికి ఈ వర్షాలు ఊరటనిచ్చాయి.
హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తుంది. వాన పడుతుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో మంగళవారం అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఇప్పటికే కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణలోని కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయని పేర్కొన్నారు.
ఏపీలో రెండు రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వ్యాఖ్యానించారు. ద్రోణి ప్రభావంతో కోస్తా, రాయలసీమలో వర్షం పడే సూచనలు ఉన్నాయని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో వచ్చే మూడు గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖపట్నం వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది! మరో 2-3 రోజుల్లో రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నాయి.