Home » Punjab
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ భార్య గుర్‌ప్రీత్ కౌర్‌పై సంచలన ఆరోపణలు వచ్చాయి. అత్యాచారం కేసులను పరిష్కరించేందుకు కోట్లా రూపాయాలు డిమాండ్ చేస్తూ దందా నడుపుతున్నారంటూ బీజేపీ ఆరోపణలు చేసింది.
పంజాబ్‌లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ నేత హత్యకు గురయ్యారు. రాజకీయ ప్రత్యర్థులు ఆయనను తుపాకితో కాల్చి చంపారు. శనివారం ఈ సంఘటన చోటుచేసుకుంది.
2027 అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఓటర్ల అభిప్రాయాలు ఆసక్తికరంగా ఉన్నాయి. మూడు రాష్ట్రాల్లోనూ ప్రజలు తమ ముఖ్యమంత్రుల కంటే ఎమ్మెల్యేల పనితీరుపైనే ఎక్కువ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తాజా సర్వేలు వెల్లడించాయి.
పెళ్లి మండపంలో పెళ్లి కుమారుడిని తొలిసారి చూసిన పెళ్లి కూతురు అందరికీ ఊహించని షాక్ ఇచ్చింది. పెళ్లి చూపుల కోసం పంపిన ఫొటోలోని వ్యక్తికి .. పెళ్లి కుమారుడికి పోలికలు లేవంటూ పెళ్లి క్యాన్సిల్ చేసింది. ఈ సంఘటన పంజాబ్‌లో చోటుచేసుకుంది.
పంజాబ్‌లోని అమృతసర్ వద్ద ఉన్న అత్తారీ-వాఘా సరిహద్దు వద్ద 'బీటింగ్ రిట్రీట్' వేడుకలు దేశభక్తి ఉప్పొంగేలా సాగాయి. దేశం నలుమూలల నుంచి తరలివచ్చిన వేలాది మంది సందర్శకులు, సరిహద్దు భద్రతా దళ సిబ్బంది ఈ ఉత్సాహభరిత కార్యక్రమంలో పాల్గొన్నారు.
మెక్సికోలో చిక్కుకున్న పంజాబీ సిక్కు యువకుడి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 'నేను పెద్ద తప్పు చేశాను' అని కన్నీళ్లు పెట్టుకుంటూ అతడు వేడుకుంటున్న తీరు అందరినీ చలింపజేస్తోంది.
అకాలీ దళ్ అధినేత, మాజీ ఉప ముఖ్యమంత్రి సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై మహారాష్ట్రలోని నాందేడ్‌లో దాడి జరిగింది. అక్కడి ఒక గురుద్వారాను సందర్శించిన తర్వాత నగర శివార్లలో దుండగులు ఈ దాడికి పాల్పడ్డారు.
మత్తులో ఉన్నట్లు కనిపిస్తున్న ఇద్దరు వ్యక్తుల వీడియోను పంజాబ్‌లో ‘జాంబీ డ్రగ్’ సమస్యకు నిదర్శనంగా పేర్కొంటూ బీజేపీ రాజ్యసభ సభ్యుడు హర్భజన్ సింగ్ సోషల్ మీడియా వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వీడియో పంజాబ్‌లో ఆప్, బీజేపీ మధ్య కొత్త రాజకీయ వివాదానికి కారణమైంది.
పంజాబ్ రాజకీయాలకు సంబంధించి ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ-అకాలీదళ్ మళ్లీ పొత్తు పెట్టుకోనున్నాయా.. అనే అంశానికి బలం చేకూరుస్తూ.. ఇవాళ ఢిల్లీలోని పార్లమెంట్ హౌస్‌లో ప్రధాని మోదీతో సుఖ్‌బీర్ బాదల్ భేటీ అయ్యారు.
పంజాబ్ పోలీసులు మరో ఉగ్రకుట్రను భగ్నం చేశారు. జంతర్‌మంతర్ నిరసనల్లో కల్లోలం సృష్టించేందుకు ప్లాన్ చేసిన తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు.