Home » Punjab
నేటి నుంచి రైతుల ‘చలో ఢిల్లీ’ మళ్లీ ప్రారంభమైంది. కేంద్రంతో 4వ విడత చర్చలు విఫలం కావడంతో తాజాగా నిర్ణయం తీసుకుంది. పంజాబ్-హర్యానా సరిహద్దు శంభు బోర్డర్ నుంచి రైతులు ఢిల్లీ వైపు బయల్దేరనున్నారు. ఆదివారం అర్థరాత్రి రైతు సంఘాల నేతలతో కేంద్ర మంత్రుల బృందం చర్చలు నిర్వహిస్తోంది.
కనీస మద్దతు ధరపై చట్టం చేయాలనే డిమాండ్‌తో సహా పలు డిమాండ్ల సాధనకు ఆందోళన సాగిస్తున్న రైతులను పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు మంగళవారంనాడు మందలించింది. మోటార్ వాహనాల చట్టం ప్రకారం హైవేలపై వారు ట్రాక్టర్ ట్రాలీలను వాడరాదని స్పష్టం చేసింది.
చండీగఢ్ మేయర్ ఎన్నికలపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ఎనిమిది చెల్లిన ఓట్లు ఉన్నాయని, కాబట్టి మళ్లీ లెక్కించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
తమ డిమాండ్ల సాధనకు రైతులు చేపట్టిన ర్యాలీలో భాగంగా ఇవాళ దేశవ్యాప్తంగా భారత్ బంద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సంయుక్త కిసాన్ మోర్చా సహా వివిధ రైతు సంఘాలు ఫిబ్రవరి 16న భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి.
రైతుల నేతృత్వంలోని 'ఢిల్లీ చలో' మార్చ్ నిరసనలు గురువారం 3వ రోజుకు చేరాయి. ఈ క్రమంలోనే రైతు సంఘాల నేతలతో చర్చలు జరిపేందుకు ముగ్గురు కేంద్ర మంత్రులు గురువారం సాయంత్రం చండీగఢ్‌లోని రైతు నాయకుల చర్చల వేదికకు చేరుకుని చర్చలు జరుపుతున్నారు.
పంజాబ్ అమృత్‌సర్‌లోని బాబా బకాలాలోని ధియాన్‌పూర్ రోడ్ డ్రెయిన్‌లో యువకుడి మృతదేహం కలకలం రేపింది. కాలువలో డెడ్ బాడీని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులో రైతుల నిరసనలు మూడో రోజు కొనసాగుతోన్నాయి. రైతు నేతలు, రైతులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. ఆ క్రమంలో వాటర్ క్యానన్లు, టియర్ గ్యాస్ ప్రయోగించారు. దీంతో వందల సంఖ్య రైతులకు గాయాలు అయ్యాయి.
శంభు సరిహద్దు వద్ద పెద్దఎత్తున రైతులు వేచిచూస్తున్నారు. ఇదే సమయంలో పతంగులు ఎగురవేస్తూ సందడి చేస్తున్నారు. తాము పంజాబ్ సరిహద్దుల్లో ఉన్నప్పటికీ హర్యానా వైపు నుంచి డ్లోన్లతో టియర్ గ్యాస్ షెల్స్ వదులుతున్నారని రైతులు చెబుతున్నారు. ఇందుకు ప్రతిగా పతంగులు ఎగురవేస్తున్నారు.
తమ డిమాండ్ల సాధన కోసం శాంతియుతంగా నిరసన చేస్తున్న రైతులను నేరస్థులుగా పరిగణించలేమని ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త, భారతరత్న అవార్డు గ్రహీత ఎంఎస్ స్వామినాథన్ కుమార్తె మధుర స్వామినాథన్ అన్నారు.
దేశ రాజధాని దిల్లీ సరిహద్దుల్లో నిరసన తెలుపుతున్న రైతులపై భాష్పవాయు ప్రయోగించడాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. అంబాలా సమీపంలోని శంభు సరిహద్దు వద్ద దిల్లీకి వెళ్లేందుకు అడ్డుగా ఉన్న బారికేడ్లను తొలగించేందుకు