Share News

Lok Sabha polls:బరిలో ఇందిరా హంతకుడి కుమారుడు

ABN , Publish Date - Apr 12 , 2024 | 07:38 PM

పంజాబ్‌లోని ఫరీద్‌కోట్ లోక్‌సభ స్థానం నుంచి సరబ్‌జిత్ సింగ్ స్వతంత్ర్య అభ్యర్థిగా బరిలో దిగారు. అతడు మాజీ ప్రధాని ఇందిరాగాంధీని హత్య చేసిన బియాంత్ సింగ్ కుమారుడు.

Lok Sabha polls:బరిలో ఇందిరా హంతకుడి కుమారుడు

చండీఘడ్, ఏప్రిల్ 12: పంజాబ్‌లోని ఫరీద్‌కోట్ లోక్‌సభ స్థానం నుంచి సరబ్‌జిత్ సింగ్ స్వతంత్ర్య అభ్యర్థిగా బరిలో దిగారు. అతడు మాజీ ప్రధాని ఇందిరాగాంధీని హత్య చేసిన బియాంత్ సింగ్ కుమారుడు.

అయితే ఈ ఎన్నికల్లో ఆప్ అభ్యర్థిగా నటుడు కరంజిత్ అన్మోల్, బీజేపీ నుంచి గాయకుడు హన్స్ రాజ్ బరిలో నిలిచారు. గత ఎన్నికల్లో ఈ లోక్ సభ స్థానం కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకొంది. ఇక 2004 లోక్‌సభ ఎన్నికల్లో సరబ్ జిత్ సింగ్ పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

ఆ తర్వాత 2007లో పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బహదౌర్ స్థానం నుంచి బరిలో దిగి ఓడిపోయారు. అలాగే 2014లో ఫతేగడ్ సాహేబ్ నుంచి పోటీ చేసి ఓటమి పాలైయ్యారు. అయితే అతడి తల్లి బిమల్ కౌర్ 1989లో రోపర్ లోక్‌సభ స్థానం నుంచి ఘన విజయం సాధించారు.

1984, అక్టోబర్ 31న నాటి ప్రధాని ఇందిరాగాంధీని న్యూఢిల్లీలోని ఆమె నివాసంలోనే.. అంగరక్షలు బియాంత్ సింగ్, సత్వంత్ సింగ్ అతి సమీపం నుంచి కాల్చి చంపారు. ఆ బియాంత్ సింగ్ కుమారుడే ఈ సరబ్‌జిత్ సింగ్. పంజాబ్‌లోని 13 లోక్‌సభ స్థానాలకు జూన్ 1వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి.

జాతీయ వార్తలు కోసం...

Updated Date - Apr 12 , 2024 | 07:39 PM