Share News

Video: బైశాఖీ సందర్భంగా గంగా నదికి పోటెత్తిన భక్తులు

ABN , Publish Date - Apr 13 , 2024 | 07:31 AM

నేడు దేశవ్యాప్తంగా బైశాఖీ పండుగ(Baisakhi festival)ను ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ పండుగకు సిక్కు మతంతో పాటు హిందూ మతంలో కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ పండుగ ఢిల్లీ, పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్, బెంగాల్, అసోం వంటి రాష్ట్రాల్లో బాగా ప్రాచుర్యం పొందింది. దేశవ్యాప్తంగా బైశాఖీ పండుగ సందర్భంగా తెల్లవారుజాము నుంచే గురుద్వార వద్దకు భక్తుల(devotees) రాక మొదలైంది.

 Video: బైశాఖీ సందర్భంగా గంగా నదికి పోటెత్తిన భక్తులు
Baisakhi festival 2024

నేడు దేశవ్యాప్తంగా బైశాఖీ పండుగ(Baisakhi festival)ను ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ పండుగకు సిక్కు మతంతో పాటు హిందూ మతంలో కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ పండుగ ఢిల్లీ, పంజాబ్(punjab), హర్యానా, ఉత్తరాఖండ్, బెంగాల్, అసోం వంటి రాష్ట్రాల్లో బాగా ప్రాచుర్యం పొందింది. దేశవ్యాప్తంగా బైశాఖీ పండుగ సందర్భంగా తెల్లవారుజాము నుంచే గురుద్వార వద్దకు భక్తుల(devotees) రాక మొదలైంది. అదే సమయంలో అనేక మంది ప్రజలు గంగా నదిలో పుణ్యస్నానాలు చేస్తున్నారు. సిక్కు మతం ప్రధాన పండుగ అయిన బైసాఖీ పండుగ నేపథ్యంలో భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు.


బైశాఖీ సందర్భంగా హరిద్వార్‌తో సహా ఉత్తరాఖండ్‌లోని అన్ని గంగా(ganga) ఘాట్‌లకు తెల్లవారుజాము నుంచే భక్తుల రద్దీ పెరిగింది. హరిద్వార్‌లోని హర్‌కీ పౌరీకి తెల్లవారుజామున చేరుకున్న భక్తులు గంగా నదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. వేల సంవత్సరాల క్రితం ఈ రోజున గంగ భూమిపై అవతరించిందని, అందుకే భక్తులు గంగా నదిలో పుణ్యస్నానం చేస్తారని నమ్ముతారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని హరిద్వార్‌లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

ఈ క్రమంలో వివిధ గురుద్వారాలు లైట్ల వెలుగులతో అలంకరించబడ్డాయి. పంజాబ్‌(punjab)లోని అమృత్‌సర్‌లో ఉన్న స్వర్ణ దేవాలయానికి తెల్లవారుజాము నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకున్నారు. స్వర్ణ దేవాలయానికి చేరుకున్న భక్తులు పూజలు చేశారు. గోల్డెన్ టెంపుల్‌తో పాటు, రూప్‌నగర్‌లోని ఆనంద్‌పూర్ సాహిబ్ గురుద్వారా, భటిండాలోని తల్వాండి సాబోలోని తఖ్త్ శ్రీ దమ్‌దామా సాహిబ్ గురుద్వారా వద్ద కూడా భక్తుల పొడవైన క్యూలు కనిపించాయి. గురుద్వారాలో ప్రార్థనలు కూడా చేశారు. ఆనంద్‌పూర్‌ సాహిబ్‌ గురుద్వారా వద్ద దర్శనం కోసం భక్తులు బారులు తీరారు.


ఇది కూడా చదవండి:

రామేశ్వరం కేఫ్‌ బాంబు పేలుళ్ల కేసులో.. ఇద్దరు నిందితులు అరెస్టు

సిద్ధాంత పోరులో ‘ఇండియా’దే విజయం

మరిన్ని జాతీయ వార్తల కోసం

Updated Date - Apr 13 , 2024 | 07:40 AM