• Home » Pressmeet

Pressmeet

BRS మాజీమంత్రి హరీష్‌రావు కీలక వ్యాఖ్యలు

BRS మాజీమంత్రి హరీష్‌రావు కీలక వ్యాఖ్యలు

బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ చావును కోరుకుంటారా.. రేవంత్ రెడ్డి.. మీకు సంస్కారం ఉందా అని హరీష్ రావు ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం తుగ్లక్ చర్యల వల్ల తెలంగాణ పరువు పోతున్నదని, కేసీఆర్ గురించి తప్పుగా మాట్లాడి.. మాట సమర్థించుకుంటున్నారని, కేసీఆర్‌కు క్షమాపణలు చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.

YS Jagan: ప్రతిపక్షంలో కూర్చోవటం కొత్తకాదు..: జగన్

YS Jagan: ప్రతిపక్షంలో కూర్చోవటం కొత్తకాదు..: జగన్

గతంలో ప్రతిపక్షంలో ఉన్నామని, కన్నుమూసి కన్ను తీరిచేలోపు ఏడాది గడిచిందని, మరో మూడు, నాలుగేళ్లు గడిస్తే వచ్చేది వైసీపీనేనని ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. గత వైసీపీ పాలనలో అన్నీ వర్గాలను అక్కున చేర్చుకున్నామని,వైసీపీ ఏదైనా చెప్పిందంటే చేస్తుందన్న నమ్మకమని ఆయన అన్నారు.

YS Sharmila: అంగన్వాడీలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చి..

YS Sharmila: అంగన్వాడీలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చి..

అంగన్‌వాడీలకు నెలకు గౌరవ వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, తక్షణం గ్రాట్యూటి చెల్లింపు హామీని అమలు చేయాలని, మినీ అంగన్‌వాడీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా పరిగణించాలని, హెల్పర్ల పదోన్నతిపై నిర్దిష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి డిమాండ్ చేశారు.

BJP:గవర్నర్ ప్రసంగంతో మాకు సంబంధం లేదు: ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి

BJP:గవర్నర్ ప్రసంగంతో మాకు సంబంధం లేదు: ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి

బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఈసారి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మా తడాఖా ఏంటో ప్రభుత్వానికి చూపిస్తామని అన్నారు. ప్రభుత్వానికి ధైర్యం ఉంటే రాష్ట్రంలో 12 వేలకు పైగా గ్రామాల్లో ప్రభుత్వ పనితనంపై అఖిల పక్షం టూర్ పెట్టాలని.. తాము వస్తామని ఆయన అన్నారు.

Bhubaneswari:  ఎన్టీఆర్ ట్రస్ట్ లక్ష్యం అదే..: నారా భువనేశ్వరి

Bhubaneswari: ఎన్టీఆర్ ట్రస్ట్ లక్ష్యం అదే..: నారా భువనేశ్వరి

విజయవాడలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు భవన్‌ నిర్మానానికి గురువారం ఉదయం శంఖుస్థాసన చేశామని ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి తెలిపారు. సమాజానికి ఏది అవసరమో, సేవభావంతో అది చేసేందుకు ఎన్టీఆర్ ట్రస్టు ఎప్పుడూ ముందు ఉంటుందని, ప్రజలకు ఏదైతే చెప్పామో అది చేసి చూపటమే ఎన్టీఆర్ ట్రస్ట్ లక్ష్యమని భువనేశ్వరి స్పష్టం చేశారు.

BRS: కేసీఆర్‌పై కోపంతో  రైతులకు అన్యాయం చేయోద్దు..: హరీష్‌రావు

BRS: కేసీఆర్‌పై కోపంతో రైతులకు అన్యాయం చేయోద్దు..: హరీష్‌రావు

గత ప్రభుత్వం (బీఆర్ఎస్) చేసిన మంచి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం తుడిచి పెట్టాలని చూస్తోందని, ఎస్ఆర్ఎస్పీ నీరు తగ్గినా కూడా కాళేశ్వరం ద్వారా రెండు పంటలకు సాగునీరు విడుదల చేశామని హరీష్ రావు చెప్పారు. మేడిగడ్డలోని ఒక్క బ్లాక్‌లోని ఒక పిల్లర్ మాత్రమే కుంగితే బీఆర్ఎస్ పై బురద జల్లి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు.

Congress Reviews: తనదైన శైలిలో ముందుకు వెళ్తున్న మీనాక్షి నటరాజన్ ..

Congress Reviews: తనదైన శైలిలో ముందుకు వెళ్తున్న మీనాక్షి నటరాజన్ ..

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసేందుకు ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ మీనాక్షి నటరాజన్ కార్యచరణ చేపట్టారు. అందులోభాగంగా పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా వరుస సమీక్షాలను ఆమె నిర్వహిస్తున్నారు.

MLC Elections: వారు ఓటు వేయడం నాకు గర్వకారణం: ఆలపాటి రాజా

MLC Elections: వారు ఓటు వేయడం నాకు గర్వకారణం: ఆలపాటి రాజా

ఎన్నికలలో వైసీపీ ఎప్పటికప్పుడు మాట మారుస్తూ వచ్చిందని, చివరకు పీడీఎఫ్ అభ్యర్దికి వైసీపీ మద్దతు ఇచ్చిందని టీడీపీ నేత ఆలపాటి రాజా అన్నారు. వైసీపీ సమాజానికి చేసిన అన్యాయం మర్చిపోలేదని.. ప్రజలు గుణపాఠం చెప్పారన్నారు. 483 బూత్‌లలో ఒక్క బూత్‌లో కూడా పీడీఎఫ్ అభ్యర్థికి మెజారిటీ రాలేదన్నారు.

TG News: కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి లేఖ

TG News: కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి లేఖ

హైదరాబాద్‌: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రేవంత్ రెడ్డి 9 పేజీల లేఖ రాశారు. ప్రభుత్వ విజ్ఞప్తులను ఆ లేఖలో ప్రస్తావించారు. ఆ లేఖలో తేదీలతో సహా ప్రస్తావించారు. తెలంగాణను కేంద్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కేంద్రమంత్రిగా కిషన్ రెడ్డి తెలంగాణకు ఏం చేశారో చెప్పాలని సీఎం రేవంత్‌ రెడ్డి డిమాండ్ చేశారు.

Posani Arrest: చట్టబద్ధంగానే వైసీపీ నేత పోసాని కృష్ణమురళీ అరెస్ట్:  మంత్రి కొల్లు రవీంద్ర

Posani Arrest: చట్టబద్ధంగానే వైసీపీ నేత పోసాని కృష్ణమురళీ అరెస్ట్: మంత్రి కొల్లు రవీంద్ర

అధర్మంగా, దుర్గార్గంగా వ్యవహరించిన ప్రతి ఒక్కరినీ ధర్మం శిక్షిస్తుందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ లను పోసాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి దూషించాడని, ఇంట్లో ఉన్న ఆడ బిడ్డల గురించి కూడా చాలా అసహ్యంగా మాట్లాడాడని మంత్రి మండిపడ్డారు. సోషల్ మీడియాలో ఆడబిడ్డలపై అనుచిత పోస్టులు పెట్టే ఏ ఒక్కరినీ ఉపేక్షించమని స్పష్టం చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి