Home » Pressmeet
Buddha Venkanna: తెలుగు దేశం సీనియర్ నేత బుద్దా వెంకన్న.. వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నానీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. వంగవీటి మోహన రంగా పేద ప్రజల కోసం పాటు పడిన మహనీయుడని, అటువంటి గొప్ప వ్యక్తితో వంశీకి పోలికా.. అంటూ మండిపడ్డారు.
Congress vs BRS: మాజీ మంత్రి కేటీఆర్ మహిళల ఆత్మ గౌరవం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. కలెక్టర్లతో కాళ్లు కడిగించుకున్న దౌర్భాగ్య పరిస్థితి మీదని.. జనాన్ని తప్పుదోవ పట్టించాలని కేటీఆర్ రోజు ఎదో ఒకటి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు.
Chinta Mohan: భారత్, పాకిస్తాన్ యుద్ధంపై ప్రధాని మోదీ అఖిల పక్షంతో చర్చించి యుద్దం ఆపితే బాగుండేదని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతా మోహన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. దేశంలో మానవ హక్కులకు భంగం వాటిల్లుతోందని, 20 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీలకు బ్యాంకులు రుణాలు సరిగా ఇవ్వటం లేదని ఆరోపించారు.
Somu Veerraju: కుహానా రాజకీయ నేతల వలన దేశానికి నష్టమని.. వాళ్లు అద్దె మైకులలాంటివారని, భారతీయులు కాదని.. బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు విమర్శించారు.సెక్యులర్ విధానాన్ని అడ్డం పెట్టుకొని దేశాన్ని దెబ్బ తీయాలని కొందరు చూస్తున్నారు అన్నారు.
MLC Kavitha: తెలంగాణ భూములను స్టాక్ ఎక్సేంజిలో కుదువపెట్టే కుట్ర జరుగుతోందని, పెద్ద మొత్తంలో అప్పులు తీసుకోడానికి టీజీఐఐసీ ద్వారా ద్వారాలు తెరిచారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. కంపెనీ హోదా మార్పు విషయాన్ని ప్రజలకు చెప్పకుండా ఎందుకు దాచిపెట్టారని ఆమె ప్రశ్నించారు. తెలంగాణ భూములను స్టాక్ ఎక్సేంజ్‌లో తాకట్టు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందన్నారు.
Operation Sindoor: పాకిస్థాన్‌లోని 9 టెర్రరిస్టుల స్థావరాలపై భారత సేనలు దాడి చేశారని, సామాన్య ప్రజలకు ఇబ్బంది లేకుండా ఏ విధంగా టార్గెట్ చేధించమనేది కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆల్ పార్టీ మీటింగ్‌లో వివరించారని టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు కృష్ణదేవరాయలు తెలిపారు. ఈ సందర్బంగా ఆర్మీ అధికారులకు ధన్యవాదాలు తెలిపామన్నారు.
operation sindoor: ఉగ్రవాదానికి శాశ్వతంగా ముగింపు వచ్చే వరకు భారతదేశం తన ఆపరేషన్‌లను కొనసాగిస్తుందని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. పాకిస్తాన్ ఇకనైనా చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోవాలన్నారు. ఉగ్రవాదులకు ఆశ్రయమివ్వడం నిలిపివేయాలని, దేశ రక్షణలో ప్రధాని మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం చూపుతున్న కట్టుదిట్టమైన విధానం అభినందనీయమని వంగలపూడి అనిత కొనియాడారు.
పాకిస్థాన్‌కు ఇది తగిన గుణపాఠమని, ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో ధీటైన జవాబు ఇచ్చామని పవన్ కల్యాణ్ అన్నారు. ఇది ప్రతి భారతీయుడు హర్షించదగ్గ పరిణామమని, సోషల్ మీడియాలో ఏది పడితే అది మాట్లాడకూడదన్నారు. భారత్ దాడిపై ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా చర్యలు ఉంటాయన్నారు.
KTR vs Revanth Reddy: కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో చెప్పిందే ఉద్యోగులు అడుగుతున్నారని, ప్రజల ముందు ఉద్యోగులను విలన్‌లుగా చిత్రీకరించే కుట్ర సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. అందాల పోటీలకు రూ. 200 కోట్లు ఉన్నాయి కానీ.. ఉద్యోగులకు ఇవ్వటానికి డబ్బులు లేవా అని ఆయన ప్రశ్నించారు.
BRS leader Harish Rao: సిద్ధిపేట మార్కెట్ యార్డ్‌లో వంద లారీలు ధాన్యం తడిసిపోయి ఉందని, వడ్ల కుప్పల మీదనే రైతులు ప్రాణాలు వదులుతున్నారని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఇప్పటికే ఐదుగురు రైతులు ధాన్యపు కుప్పల మీదనే ప్రాణాలు వదిలారని.. ఇవి సాధారణ మరణాలు కావని, ప్రభుత్వ హత్యలేనని ఆయన ఆరోపించారు.