Home » Pressmeet
TG News: కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కేసీఆర్, హరీష్ రావులపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్ రెడ్డితో నాలుగు సార్లు మంతనాలు జరిపి తెలంగాణ నీళ్లకు అన్యాయం చేసింది కేసీఆర్ అని, హరీష్ రావు వైఖరి వల్లే ఏపీ నేతలు బనకచర్లకు నీళ్ళు తరలించుకుందామనే ఆలోచన చేశారని ఆయన అన్నారు.
BJP vs YCP:బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రాష్ట్రానికి సీఎంగా పనిచేసిన విషయాన్ని మరిచిపోయి.. ప్రధాని మోదీ ఏపీకి రావడానికి ముందు రాష్ట్రంలో ఏదో జరిగిపోతోందనే విషప్రచారం చేయాలని చూశారని మండిపడ్డారు.
CR Patil meeting: సీఎం రేవంత్ రెడ్డి బృందం ఢిల్లీ పర్యటనలో ఉంది. అందులో భాగంగా గురువారం కేంద్ర జల శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో సమావేశమయ్యారు. భేటీ ముగిసిన అనంతరం మంత్రి ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు. బనకచర్ల ప్రాజెక్టు అంశంలో తమకు ఉన్న అభ్యంతరాలను కేంద్రమంత్రికి వివరించామని చెప్పారు.
Raja Singh: తెలంగాణలో గోవుల సంరక్షణకు ఎంత ఖర్చైనా ప్రభుత్వం వెనుకాడబోదని సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనపై బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి ఆయన ధన్యవాదాలు తెలిపారు.
Minister Nimmla: బనకచర్లపై వస్తున్న ఆరోపణలు కేవలం రాజకీయాలు కోసమేనని, సాంకేతిక అంశాల కన్నా రాజకీయంపై దృష్టితోనే ఆరోపణలు చేస్తున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. తెలంగాణలో అంతర్గత రాజకీయలు కోసం బనకచర్లపై విమర్శలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
Modi Golden Chapter: జల జీవన్, ఆయుష్మాన్ భారత్, ఇలా అనేక కేంద్ర పథకాలతో ప్రధాని మోదీ పేదలకు మంచి చేస్తున్నారని, పర్యావరణాన్ని కాపాడటంలో గత ప్రభుత్వాలకు భిన్నంగా మోదీ పనిచేస్తున్నారని ఎమ్మెల్యే రామకృష్ణా రెడ్డి అన్నారు. ఆపరేషన్ సింధూర్‌తో రక్షణ రంగంలో ఎంత ప్రగతి సాధించామో ప్రపంచ దేశాలకు చాటి చెప్పామన్నారు.
Yanamala: రూల్ ఆఫ్ లా సాక్షి యాజమాన్యానికి, సాక్షిలో పని చేసే సిబ్బందికి వర్తించదా.. అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. వైఎస్ పాలనలో, జగన్ హయాంలో మీడియా వాచ్ పేరుతో నాటి ప్రభుత్వాలు నల్ల చట్టాలు తీసుకురాలేదా అని నిలదీశారు.
Gajjal Kantham: రాష్ట్ర ముఖ్యంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన రోజే కాళేశ్వరంపై విచారణ చేయిస్తామని మాట ఇచ్చారని, పీసీసీ చీఫ్‌గా ఉన్నపుడే రేవంత్ రెడ్డి కాళేశ్వర ప్రాజెక్టులో జరిగిన అవినీతిని బయట పెట్టారని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ గజ్జల కాంతం అన్నారు.
Perni Nani: నకిలీ పట్టాల వివాదంలో పేర్ని నానిని అరెస్టు చేస్తారనే ప్రచారం నేపథ్యంలో వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పేర్నినాని మచిలీపట్నంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర, అధికారులపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
Bonda Uma: గత ప్రభుత్వంలో ఉన్న రోడ్లు.. ఈ ఏడాది పాలనలో ఉన్న రోడ్లు చూస్తేనే ప్రజలకు అర్ధమవుతుందని ఎమ్మెల్యే బోండా ఉమ అన్నారు. తప్పకుండా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడంతో పాటు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని స్పష్టం చేశారు.