Home » Ponnam Prabhakar
కాంగ్రెస్ బీసీ నాయకులం అందరమూ చేతులు జోడించి వేడుకుంటున్నాం. బీసీల నోటికాడి ముద్ద లాక్కోకండి. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ కాంగ్రెస్ సర్కారు తీసుకువస్తున్న..
రాష్ట్రంలోని వెనుకబడిన వర్గాలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రంలో అమలులో ఉన్న పంచాయతీరాజ్ చట్టం-2018ను సవరించి, ఆర్డినెన్స్‌ను తేవడం ద్వారా ఈ రిజర్వేషన్లను వర్తింపజేస్తారు.
బీసీ రిజర్వేషన్లు పెంచకుండా ఎట్టి పరిస్థితుల్లో స్థానిక ఎన్నికలు నిర్వహించవద్దని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్‌కు విజ్ఞప్తి చేశారు.
ఇతర రాష్ట్రాల్లోని రవాణా శాఖలో భవిష్యత్తులో కొత్తగా విధుల్లో చేరే వారికి రాష్ట్ర రవాణశాఖలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ (ఏఎంవీఐ)లు రోల్ మోడల్ కావాలని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు.
గడిచిన 11 ఏళ్లలో కేంద్రం నుంచి తెలంగాణకు అణా పైసా తేలేని బీజేపీ నేతలు.. తమకు లేఖలు రాయడం విడ్డూరంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
మోదీ ప్రభుత్వం.. వాగ్దానాలతో ఊదరగొట్టడం… విద్వేషాన్ని రెచ్చగొట్టడం… అబద్ధాలను ఆవిష్కరించడం తప్ప దేశ ప్రజలకు చేసిందేమి లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజలను అడుగడుగునా మోసం చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు.
RTC Women Bus Owners: కోటి మంది మహిళలను కోటీశ్వరీమణులను చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. మహిళలకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను గ్రౌండ్ లెవెల్లో తెలిసేలా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు.
క్రమశిక్షణకు మారు పేరు.. అజాత శత్రువుగా తెలుగు ప్రజల మనసుల్లో సుస్థిరస్థానం సంపాదించుకున్న నేత మాజీ సీఎం కొణిజేటి రోశయ్య అని మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు కొనియాడారు.
బీసీ వ్యతిరేక పార్టీ అని బీజేపీ మరోమారు నిరూపించుకుందని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణాశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
ప్రభుత్వ ఉద్యోగులను ప్రతిపక్ష బీఆర్‌ఎస్ నేతలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని, కానీ వారు ప్రజా సంక్షేమం కోసం విజ్ఞతతో వ్యవహరిస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి అనుగుణంగా నడుస్తోందన్నారు.