Home » Ponnam Prabhakar
కరీంనగర్: మంత్రి పొన్నం ప్రభాకర్ బీఆర్ఎస్, బీజేపీలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కులగణనపై ఆ పార్టీలు చేస్తున్న కామెంట్స్ సరికాదన్నారు. బలహీన వర్గాలకు న్యాయం జరగడం ఇష్టం లేదా అని ప్రశ్నించారు. మైనార్టీలను ఇప్పుడు కొత్తగా బీసీల్లో చేర్చలేదని.. మైనార్టీలు ఎప్పటి నుంచో బీసీల్లో ఉన్నారని మంత్రి పొన్నం స్పష్టం చేశారు.
ఆర్థోపెడిక్ సమస్యలపై ప్రజల్లో అవగాహన అవసరమని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రజలు తమ జీవితంలో రోజు వారీ వాకింగ్, రన్నింగ్ చేయడం అవసరమని అన్నారు.
బీసీ కమిషన్, బీసీ సంఘాల ప్రతినిధులు, బీసీ మేధావులతో ప్రభుత్వ సలహాదారు కే కేశవురావుతో కలిసి శనివారం ఆయన సచివాలయంలో సమావేశమయ్యారు.
రాష్ట్రంలో కులగణన సర్వే శాస్త్రీయంగా జరిగిందని, ప్రతిపక్ష నేతల ట్రాప్‌లో పడొద్దని బీసీ సంఘాల నేతలకు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రంలోని ఎస్సీలను మూడు గ్రూపులుగా వర్గీకరించాలని ఈ అంశంపై నియమించిన ఏకసభ్య కమిషన్ ప్రభుత్వానికి సూచించినట్టు తెలిసింది. గతంలోలా ‘ఏ బీ సీ డీ’గా కాకుండా ఇప్పుడు ‘ఏ బీ సీ’ గ్రూపులుగా వర్గీకరించాలని ప్రభుత్వానికి సమర్పించిన తన నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది.
Minister Ponnam Prabhakar: తెలంగాణ విద్య వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తల్లిదండ్రులు పిల్లలను బాలకార్మికులుగా చేర్చే ప్రయత్నం చేయొద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
తెలంగాణలో కులాలవారీ జనాభా లెక్క తేలింది. రాష్ట్రంలో ఏ సామాజికవర్గం వారు ఎంతమంది ఉన్నారనే వివరాలు సేకరించేందుకు చేపట్టిన కులసర్వే నివేదిక ప్రభుత్వానికి అందింది.
రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కలిగిస్తూ నెల రోజులపాటు రవాణా, పోలీసు శాఖ నిర్వహిస్తున్న రోడ్డు భద్రత మాసోత్సవాలు శుక్రవారం ముగిశాయి. ముగింపు రోజున రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వాకథాన్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) ప్రారంభించారు.
రానున్న పదో తరగతి, ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషి చేయాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) అధ్యాపకులు, ఉపాధ్యాయులకు సూచించారు.
‘‘ బలహీన వర్గాల ఇళ్లకు ఇందిరమ్మ పేరు పెడితే డబ్బులు ఇవ్వరా? ఈ ఇళ్లకు ఏమైనా నీ ఇంట్లో డబ్బులు ఇస్తున్నవా?’’ అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్‌ని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు.