Share News

Ponnam: కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌లకు కులగుణన సర్వే ఫాంలను పంపాం

ABN , Publish Date - Feb 12 , 2025 | 05:20 AM

‘‘కులగణనలో భాగంగా సర్వేకు వెళ్లిన అధికారులకు బీఆర్‌ఎస్‌ నాయకులు కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌ రావు ఎలాంటి వివరాలు ఇవ్వలేదు.

Ponnam: కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌లకు కులగుణన సర్వే ఫాంలను పంపాం

  • జవాబు ఇచ్చిన తరువాతనే మాట్లాడండి: పొన్నం

కరీంనగర్‌ అర్బన్‌, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): ‘‘కులగణనలో భాగంగా సర్వేకు వెళ్లిన అధికారులకు బీఆర్‌ఎస్‌ నాయకులు కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌ రావు ఎలాంటి వివరాలు ఇవ్వలేదు. ఇప్పుడైనా వాళ్ల కుటుంబ, ఆస్తులు, ఇతర వివరాలు అందజేయాలని కోరుతూ సర్వే ఫాంలను పోస్ట్‌ ద్వారా ఆ ముగ్గురు నేతలకు పంపిస్తున్నా’’ అని మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. మంగళవారం కరీంనగర్‌లో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ముందు బీఆర్‌ఎస్‌ అగ్రనేతలు వారి వివరాలు అందజేసిన తరువాతనే కులగణనపై మాట్లాడాలన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కులగణన దేశానికే మార్గదర్శకంగా నిలుస్తుందని చెప్పారు. కులగణనను అడ్డుకుంటూ సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ను సమర్పించిన బీజేపీకి, సర్వేలో పాల్గొనని బీఆర్‌ఎస్‌ నేతలకు కులగణనపై మాట్లాడే నైతిక అర్హత లేదని ఆయన అన్నారు.

Updated Date - Feb 12 , 2025 | 05:20 AM