Ponnam Prabhakar: ఇన్‌స్పైర్ రాష్ట్రస్థాయికి 50 మంది బీసీ గురుకుల విద్యార్థులు
ABN , Publish Date - Mar 08 , 2025 | 03:40 AM
విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసే ఇన్‌స్పైర్ రాష్ట్రస్థాయి ప్రదర్శనకు ఎంపికైన 50 మంది బీసీ గురుకుల పాఠశాల విద్యార్థులను మంత్రి పొన్నం ప్రభాకర్ శుక్రవారం అభినందించారు.
అభినందించిన మంత్రి పొన్నం
హైదరాబాద్, మార్చి7 (ఆంధ్రజ్యోతి): విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసే ఇన్‌స్పైర్ రాష్ట్రస్థాయి ప్రదర్శనకు ఎంపికైన 50 మంది బీసీ గురుకుల పాఠశాల విద్యార్థులను మంత్రి పొన్నం ప్రభాకర్ శుక్రవారం అభినందించారు. 6 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు నిర్వహించిన జిల్లా స్థాయి పోటీల్లో ఈ 50 మంది విద్యార్థులు రాష్ట్ర స్థాయికి ఎంపికవడం విశేషమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రస్థాయి ప్రదర్శనకు ఎంపికైన విద్యార్థుల బ్యాంక్ ఖాతాలో రూ.10వేల నగదు జమవుతాయని, దీంతో వారి ఆలోచన మేరకు ప్రాజెక్ట్‌ను రూపొందించుకుని ప్రదర్శనలో ఉంచాలని ఆయన పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
CM Revanth Reddy: సొల్లు మాటలు వద్దు.. ఆధారాలతో చూపించండి
Telangana: మేడిగడ్డ వ్యవహారం.. కేసీఆర్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్..
TGSRTC: భక్తులకు గుడ్ న్యూస్ చెప్పిన టీజీఎస్‌ఆర్టీసీ.. ఆరోజు ఏకంగా 3 వేల బస్సులు..
Read Latest Telangana News And Telugu News