Home » Ponnam Prabhakar
Minister Seethakka: ములుగు జిల్లాలో మంత్రి సీతక్క ఆదివారం నాడు పర్యటించారు. పలు కార్యక్రమాల్లో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ములుగు అభివద్ధికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి సీతక్క పేర్కొన్నారు.
ఆర్టీసీ జేఏసీ ఇచ్చిన సమ్మె పిలుపును విరమింపజేసేందుకు ప్రభు త్వం సమాలోచనలు చేస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
బంజారాహిల్స్‌లో 12 ఎకరాల ప్రభుత్వ భూమిని అధికారాలు సకాలంలో గుర్తించి స్వాధీనం చేసుకోవడంపై మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశంసించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజావసరాల కోసం భూముల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా.. ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొన్న ప్రకారం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయకపోవడంపై కార్మికులు అసంతృప్తిగా ఉన్నారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఇతర సమస్యలపై కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడాన్ని వారు తప్పుపడుతున్నారు.
కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ అభివృద్థి చేసిన ‘సారథి’, ‘వాహన్’ డిజిటల్ సేవలు ఇక రాష్ట్ర ప్రజలకూ అందుబాటులోకి రానున్నాయి. దేశవ్యాప్తంగా రవాణా శాఖ సేవలు ఒకే గొడుగు కిందకు తీసుకురావడం ఈ సేవల వెనుక ఉద్దేశం.
ఒక్క భూమి ఇద్దరు రిజిస్ట్రేషన్ చేసుకునే పరిస్థితి వచ్చిందని, ధరణి వచ్చిన తరువాత భూ సమస్యలు వచ్చాయని.. ఒకరి భూమి మరొకరికి వచ్చిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఎమ్మార్వో లు పరిష్కారం చేసే పరిస్థితి లేదని.. ఆధార్ లాగ భూధార్ వచ్చిందన్నారు. భూమి రికార్డులు వెరిఫై చేసి ఎలాంటి వివాదాలు లేకుండా హక్కులు కల్పిస్తామని చెప్పారు.
కేసీఆర్ కాంగ్రెస్ పార్టీని విలన్‌గా చూపించాలని ప్రయత్నిస్తున్నారని మంత్రి పొంగులేటి విమర్శించారు. కాంగ్రెస్ ఇచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ సాష్టాంగ నమస్కారం చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు
రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఉద్యోగుల పెండింగ్ సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు
దుబాయ్‌లో పని చేస్తున్న హుస్నాబాద్‌కు చెందిన చొప్పరి లింగయ్య ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతూ, మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో స్వదేశానికి చేరుకున్నాడు. లింగయ్యకు విమాన టికెట్‌ను ఏర్పాటు చేసి, ఆయనను హుస్నాబాద్‌కు తీసుకురావడం కోసం మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన కృషి ప్రశంసనీయమైంది
మంత్రి పొన్నం ప్రభాకర్ బేగంపేటలో జరిగిన కార్యక్రమంలో, ఇంటర్ బీసీ గురుకుల, హాస్టల్ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేశారు. 162 మంది విద్యార్థులకు రూ. 10 వేల నగదు ప్రోత్సాహం అందించారు, తద్వారా వారికి ప్రోత్సాహాన్ని ఇచ్చి మంచి భవిష్యత్తు సాధించాలన్న ఆకాంక్షతో మార్గనిర్దేశం చేశారు