Share News

Ponnam: ఆరు నెలల్లో హైటెక్‌ బస్టాండ్‌

ABN , Publish Date - May 05 , 2025 | 04:02 AM

ములుగు జిల్లా ప్రజల దశాబ్దాల కలనూతనంగా ఏర్పాటు చేయబోయే బస్టాండ్‌తో నెరవేరనుందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు.

Ponnam: ఆరు నెలల్లో హైటెక్‌ బస్టాండ్‌

  • ములుగు ప్రజల కల నెరవేరుస్తాం: పొన్నం

ములుగు, మే 4 (ఆంధ్రజ్యోతి) : ములుగు జిల్లా ప్రజల దశాబ్దాల కలనూతనంగా ఏర్పాటు చేయబోయే బస్టాండ్‌తో నెరవేరనుందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. జిల్లా కేంద్రంలో రూ. 4.80 కోట్లతో నిర్మించబోయే నూతన ఆర్టీసీ బస్టాండ్‌కు రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి సీతక్కతో కలిసి ఆదివారం శంకుస్థాపన చేశారు. ముందుగా మంత్రులిద్దరూ గట్టమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారికి కాంగ్రెస్‌ కార్యకర్తలు గజమాలతో స్వాగతం పలికారు. అక్కడి నుంచి మంత్రులు ర్యాలీగా బయలుదేరి జిల్లా కేంద్రానికి చేరుకున్నారు.


అనంతరం పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలో హైటెక్‌ తరహాలో నూతన బస్టాండ్‌ను ఆరు నెలల్లో నిర్మించి ప్రారంభించబోతున్నామన్నారు. రాష్ట్రంలో గ్రామ గ్రామానికి బస్సు సౌకర్యాన్ని కల్పించి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నామన్నారు. ములుగు జిల్లా బస్టాండ్‌ బాగోలేదని మంత్రి సీతక్క తన దృష్టికి తీసుకొచ్చారని, దీంతో వెంటనే నిర్మాణానికి నిధులు మంజూరు చేశామన్నారు. అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో బస్టాండ్ల నిర్మాణానికి నిధులు కేటాయించిన మంత్రి పొన్నం ప్రభాకర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి:

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి తప్పిన ప్రమాదం.. అసలు విషయం ఇదే..

AP Liquor Scam: మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి షాక్.. ఆ కేసులో నోటీసులు జారీ..

Supreme Court: వివేకా హత్య కేసు..ఉదయ్ కుమార్ రెడ్డికి సుప్రీం నోటీసులు..

Updated Date - May 05 , 2025 | 04:02 AM