• Home » Politicians

Politicians

CS Shantikumari :ఆరుగురుకి డిప్యూటీ సెక్రటరీలుగా పదోన్నతి

CS Shantikumari :ఆరుగురుకి డిప్యూటీ సెక్రటరీలుగా పదోన్నతి

రాష్ట్ర సచివాలయంలోని వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఆరుగురు సహాయ కార్యదర్శులకు ప్రభుత్వం డిప్యూటీ సెక్రటరీలుగా పదోన్నతులు కల్పించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శుక్రవారం జీవోను జారీ చేశారు.

CSDS survey :బీజేపీకి  తగ్గిన  3%  దళిత ఓట్లు

CSDS survey :బీజేపీకి తగ్గిన 3% దళిత ఓట్లు

దళితులు జాతీయ పార్టీలకన్నా ప్రాంతీయ పార్టీలవైపు మొగ్గు చూపినట్టు ఇటీవలి లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెల్లడిస్తున్నాయి. ఫలితాలపై సీఎ్‌సడీఎస్‌ సర్వే సంస్థ జరిపిన అధ్యయనం ప్రకారం దళితులు బీజేపీకన్నా ఇతర పార్టీలను ఆదరించారు.

Tamilisai: మందలించ లేదు.. సలహాలు ఇచ్చారు

Tamilisai: మందలించ లేదు.. సలహాలు ఇచ్చారు

ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం జరిగిన సందర్భంగా వేదికపై ఆసీనులైన కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా తనను మందిలించారంటూ జరుగుతున్న ప్రచారంపై తెలంగాణ మాజీ గవర్నర్‌ తమిళిసై వివరణ ఇచ్చారు. ఆయన తననేమీ మందలించలేదని, పార్టీ కోసం పనిచేయాలంటూ సూచనలు ఇచ్చారని స్పష్టం చేశారు.

Bengaluru court: యడియూరప్పకు నాన్‌బెయిలబుల్‌  వారెంట్‌

Bengaluru court: యడియూరప్పకు నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌

పోక్సో కేసులో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నాయకుడు యడియూరప్పపై బెంగళూరు కోర్టు నాన్‌బెయిలబుల్‌ అరెస్టు వారెంట్‌ జారీ చేసింది. దీంతో ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీఐడీ పోలీసులు ఆయనను అరెస్టు చేసే అవకాశం ఉంది. సాయం కోసం కుమార్తె(17)తో కలిసి తాను ఈఏడాది ఫిబ్రవరి 2న యడియూరప్ప ఇంటికి వెళ్లగా తన కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో సదాశివనగర్‌ పోలీసులు మార్చి 14న ఆయనపై పోక్సో కేసు నమోదు చేశారు.

కేసీఆర్‌ కోసం కొన్న కార్లు మంత్రులకు

కేసీఆర్‌ కోసం కొన్న కార్లు మంత్రులకు

తెలంగాణ రాష్ట్ర మంత్రులు ఇకపై ల్యాండ్‌ క్రూయిజర్‌ కార్లలో ప్రయాణించనున్నారు. పూర్తిస్థాయి బుల్లెట్‌ ప్రూఫ్‌తోపాటు శాటిలైట్‌ ఆధారిత టెక్నాలజీతో రూపుదిద్దుకున్న ల్యాండ్‌ క్రూయిజర్లను మంత్రులకు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేసీఆర్‌ సీఎంగా ఉన్న సమయంలో తన కాన్వాయ్‌ కోసం రూ.66 కోట్లతో 22 ల్యాండ్‌ క్రూయిజర్‌ కార్లను కొనుగోలు చేశారు.

Bengal's Shantanu Sinha's : అమిత్‌ మాలవీయ స్త్రీలోలుడు

Bengal's Shantanu Sinha's : అమిత్‌ మాలవీయ స్త్రీలోలుడు

బీజేపీ ఐటీ సెల్‌ చీఫ్‌ అమిత్‌ మాలవీయ బెంగాల్‌కు వచ్చినప్పుడల్లా అక్కడ పలువురు మహిళలతో శారీరకంగా గడిపేవారని పశ్చిమ బెంగాల్‌కే చెందిన శంతను సిన్హా సంచలన ఆరోపణలు చేశారు. శృంగార కార్యకలాపాల కోసం ఆయన బెంగాల్‌లోని బీజేపీ కార్యాలయాలను కూడా ఉపయోగించుకున్నారని ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు.

PM Modi: హుందాగా, అణకువగా  ఉండండి

PM Modi: హుందాగా, అణకువగా ఉండండి

మంత్రులంతా ప్రజలకు నచ్చేలా అణకువగా, హుందాగా ఉండాలని, విధి నిర్వహణలో అత్యంత పారదర్శకంగా వ్యవహరించాలని కేంద్ర నూతన మంత్రి వర్గానికి ప్రధాని మోదీ సూచించారు. వికసిత్‌ భారత్‌ లక్ష్యం నెరవేరేందుకు మంత్రి వర్గమంతా కృషి చేయాలని స్పష్టం చేశారు.

Mamata: ఏమో.. మోదీ సర్కారు 15 రోజుల్లో కూలిపోవచ్చు

Mamata: ఏమో.. మోదీ సర్కారు 15 రోజుల్లో కూలిపోవచ్చు

ఎన్నికల్లో కనీస మెజారిటీ సాధించడంలో విఫలమై.. మిత్రపక్షాల మద్దతుతో ఎన్డీఏ అధికారం చేపడుతున్న వేళ పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. కొన్ని ప్రభుత్వాలు ఒక్కరోజే ఉంటాయని.. మోదీ సర్కారు పదిహేను రోజుల్లో కూలిపోవచ్చేమో? అని పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం అప్రజాస్వామికంగా, అక్రమంగా అధికారంలోకి వచ్చిందని, వారికి శుభాకాంక్షలు చెప్పలేమని వ్యాఖ్యానించారు.

BJP: తెలంగాణకు 2 కేంద్ర మంత్రి పదవులు?

BJP: తెలంగాణకు 2 కేంద్ర మంత్రి పదవులు?

దేశంలో మూడోసారి ఎన్‌డీయే కూటమి అధికారం చేపట్టబోతోంది. ఆదివారం సాయంత్రం ప్రధానిగా మోదీతో పాటు కొద్దిమంది కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి పదవుల కేటాయింపుపై ఢిల్లీలో ముమ్మర కసరత్తు జరుగుతోంది. గురువారమే ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో బీజేపీ, సంఘ్‌ పెద్దలు భేటీ అయ్యారు. బీజేపీ నాయకులకు, మిత్రపక్షాలకు కేటాయింపులపై చర్చించారు. సొంతంగా మ్యాజిక్‌ మార్కు దాటని బీజేపీకి దక్షిణాదిలో అత్యధిక స్థానాలు వచ్చిన రాష్ట్రం తెలంగాణ. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నా ఆ పార్టీతో సమానంగా బీజేపీ 8 స్థానాలు సాధించింది.

Imran Khan :కేజ్రీవాల్‌కు అక్కడ బెయిల్‌ ఇక్కడ నాకేమో  వేధింపులు

Imran Khan :కేజ్రీవాల్‌కు అక్కడ బెయిల్‌ ఇక్కడ నాకేమో వేధింపులు

అక్రమంగా తనను అరెస్టు చేయడమేకాకుండా జైలులో వేధిస్తున్నారని పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేశారు. రాజకీయాల్లో పాల్గొనకుండా ఉండేందుకే తనను అరెస్టు చేశారని తెలిపారు. గురువారం పాక్‌ సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలోని అయిదుగురు సభ్యుల ధర్మాసనం ఆయన కేసుపై విచారణ జరిపింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి